Deepthi Eliminated From Bigg Boss House Today | హఠాత్తుగా బిగ్‌ బాస్‌ నుంచి దీప్తి ఎలిమినేట్‌‌? | Mid Week Elimination - Sakshi
Sakshi News home page

Published Thu, Sep 27 2018 11:58 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Deepthi Nallamothu Eliminated From Bigg Boss House - Sakshi

హైదరాబాద్‌ : దాదాపు మూడున్నర నెలల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 తుది అంకానికి చేరుకుంది. ఈ వారంతో బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరో తేలిపోనుంది.  ఇప్పటి వరకు 14 మంది ఎలిమినేషన్స్‌ జరిగి, టాప్‌ 5 కంటెస్టెంట్లు గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్న తెలిసిందే. అందులో గీతా మాధురి, కౌశల్‌, తనీశ్‌, సామ్రాట్‌, దీప్తి నల్లమోతు ఉన్నారు. అయితే గురువారం బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి ఒకరు ఎలిమినేట్‌ అవుతున్నట్టు ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. మాములుగా శని, ఆది వారాల్లో మాత్రమే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో జరిగే ప్రతి అంశం కూడా ముందుగానే బయటికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రోజునే బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్‌ కానున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ పక్రియ జరగనుందని.. అందులో భాగంగా దీప్తి హౌజ్‌ నుంచి బయటకు వెళ్లనున్నారని సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ నడిచాయి. అంతేకాకుండా గ్రాండ్‌ ఫినాలేలో నలుగురు మాత్రమే పోటీ పడనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అవి కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా, ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లకు పోలవుతున్న ఓట్ల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొందరు కంటెస్టెంట్‌ల పేరిట భారీగా ఫేక్‌ ఓటింగ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ.. బిగ్‌బాస్‌ విజేత ఎవరనేది ఈ వీకెండ్‌లో తేలిపోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement