

‘రాధమ్మ కూతురు’ సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది దీప్తి మన్నే

వెండితెరను వదిలి... బుల్లితెరపై రాణిస్తుంది ఈ కన్నడ బ్యూటీ

కర్ణాటకలోని దావణగిరిలో జన్మించినప్పటికీ ఆమె తాతగారిది పశ్చిమగోదావరి జిల్లా కావడం విశేషం.

దావణగిరిలోనే ఇంటర్ వరకు చదివిన దీప్తి.. ఆ తరువాత బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం బెంగళూరు వెళ్లింది.

కన్నడ,తమిళ్,తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఆమె బుల్లితెరవైపు అడుగులేసి విజయం సాధించింది.

కన్నడలో పద్మావతి సిరియల్‌తో విశేష గుర్తింపు వచ్చింది.

అలా తెలుగులో 'రాధమ్మ కూతురు'లో తొలి ఛాన్స్ దక్కింది.. ఈ సీరియల్‌లో అక్షరగా అలరించింది.

కాబోయేవాడు జంటిల్‌మెన్ అయితే చాలని గతంలో ఓ ఇంటర్వ్యూలో దీప్తి పంచుకుంది.

అబ్బాయికి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు తెలివైనవాడైతే చాలని తన తండ్రి కూడా చెప్పినట్లు ఆమె పేర్కొంది.

బుల్లితెరపై కథకు తగ్గట్లు మెప్పించిన దీప్తీ.. సోషల్‌మీడియాలో హాట్ ఫోజులతో కుర్రకారును ఫిదా చేస్తుంది.










