సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ సీజన్2 అలరిస్తోంది. కంటెస్టెంట్స్ తమ గేమ్‌ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ హలీం, స్వీట్లు పంపించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తొలి వారం పూర్తైంది. తొలి ఎలిమినేషన్‌కు కూడా టైం దగ్గర పడింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాని మళ్లీ వచ్చేశారు. కంటెస్టెంట్స్‌ను టీవీ ద్వారా పలకరించారు. ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ (విమర్శించడం)పై స్పందించారు.
బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ ఫ్యాన్స్ క్లబ్, దీప్తి సునయన ఆర్మీ అంటూ అభిమానులు సోషల్ మీడియా పేజీలు సృష్టించారని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో విమర్శించడం, బురద చల్లడం చాలా పెద్ద సమస్యగా తయారైందన్నారు. సరదా కోసం చేస్తే తప్పు లేదని, కానీ అదేపనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుర్తింపు కోసం వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేసే విధంగా వ్యక్తులు తయారయ్యారని పేర్కొన్నారు.
ట్రోలింగ్ తప్పు కాదని, కానీ ఏదీ శ్రుతి మించకూడదని హితవు పలికారు. ఇరవై ఏళ్ల వయసులో సునయన డబ్‌ష్మాస్‌లు, షార్ట్‌ఫిల్మ్స్ చేసుకుంటూ, అందరికీ తెలిసే స్థాయికి వచ్చారంటూ ప్రశంసించారు. తాను ఇరవై ఏళ్ల వయసులో ఫిలింనగర్ రోడ్ల మీద తిరిగానంటూ నాని గుర్తు చేసుకున్నారు. ఎలిమినేషన్ ఓటింగ్‌లో దీప్తి సునయనకు చాలా మంది మద్దతుగా నిలిచారని, భారీగా వచ్చిన ఓట్లతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఎందుకు ఏడ్చారని అడగ్గా, కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంతో ఏడ్చానని సమాధానం ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు, సభ్యుల మధ్య గొడవలను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment