
‘‘మీట్ క్యూట్’ కథని నా సోదరి దీప్తి రాసిందని నేను నిర్మించలేదు. మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేవాణ్ణి.. ఈ స్క్రిప్ట్ అంత అద్భుతంగా ఉంది. ఇందులోని పాత్రలు, మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలన్నీ సహజంగా ఉంటాయి’’ అని హీరో నాని అన్నారు. అదా శర్మ, వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రోహిణి మొల్లేటి, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సోదరి దీప్తి గంటా కథ రాసి, దర్శకత్వం వహించారు.
నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 25 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘ఈ స్క్రిప్‌్టని చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. దీప్తి ఒత్తిడి చేసేసరికి చదవడం ప్రారంభించాను. కొన్ని పేజీలు చదివేసరికి కథలో లీనమయ్యాను. ఈ స్క్రిప్ట్‌లోనే దీప్తి డైరెక్షన్ కనిపించింది’’ అన్నారు.
దీప్తి మాట్లాడుతూ– ‘‘నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ‘మీట్ క్యూట్’లో ఒక కథ రాసి, నానీకి వినిపించాను. ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాస్తే ఆంథాలజీ చేయొచ్చని సలహా ఇచ్చాడు. జర్నీల్లో, ఇతర సందర్భాల్లో అపరిచిత వ్యక్తుల మధ్య మాటలు ఎలా ఉంటాయి? అనే ఊహతో ఈ స్క్రిప్ట్ రాశాను. ఓ మంచి లవ్ స్టోరీ రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment