Meet Cute Movie
-
డైరెక్టర్‌గా మారిన నాని సోదరి.. ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ
‘‘మీట్ క్యూట్’ కథని నా సోదరి దీప్తి రాసిందని నేను నిర్మించలేదు. మరెవరు రాసినా ప్రొడ్యూస్ చేసేవాణ్ణి.. ఈ స్క్రిప్ట్ అంత అద్భుతంగా ఉంది. ఇందులోని పాత్రలు, మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలన్నీ సహజంగా ఉంటాయి’’ అని హీరో నాని అన్నారు. అదా శర్మ, వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రోహిణి మొల్లేటి, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సోదరి దీప్తి గంటా కథ రాసి, దర్శకత్వం వహించారు. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 25 నుంచి సోని లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘ఈ స్క్రిప్‌్టని చాలా రోజులు చదవకుండా పక్కన పెట్టాను. దీప్తి ఒత్తిడి చేసేసరికి చదవడం ప్రారంభించాను. కొన్ని పేజీలు చదివేసరికి కథలో లీనమయ్యాను. ఈ స్క్రిప్ట్‌లోనే దీప్తి డైరెక్షన్ కనిపించింది’’ అన్నారు. దీప్తి మాట్లాడుతూ– ‘‘నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. ‘మీట్ క్యూట్’లో ఒక కథ రాసి, నానీకి వినిపించాను. ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాస్తే ఆంథాలజీ చేయొచ్చని సలహా ఇచ్చాడు. జర్నీల్లో, ఇతర సందర్భాల్లో అపరిచిత వ్యక్తుల మధ్య మాటలు ఎలా ఉంటాయి? అనే ఊహతో ఈ స్క్రిప్ట్ రాశాను. ఓ మంచి లవ్ స్టోరీ రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా’’ అన్నారు. -
ఆ ఓటీటీలోకి నాని ‘మీట్ క్యూట్’.. ఆకట్టుకుంటున్న టీజర్
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ప్రముఖ ఓటీటీ సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అందరూ యంగ్ హీరోహీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ..నా ఫేవరేట్ మూవీస్ లో ద హాలీడే ఒకటి. ఈ సినిమాలో మీట్ క్యూట్ అనే పదాన్ని విన్నాను. పరిచయం లేని ఇద్దరు ఊహించని ఒక అందమైన ప్రదేశంలో కలుస్తారు. వీరి మధ్య సాగిన అందమైన సంభాషణ జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది. మన లైఫ్ లో ఎదురయ్యే అందమైన సందర్భాలను ఈ అంథాలజీ చూపిస్తుంది. వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న సోని లివ్ ద్వారా మీట్ క్యూట్ ప్రదర్శితం కాబోతుండటం సంతోషంగా ఉంది’అని అన్నారు. -
నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే..
Nani Movie Movie Release On Direct OTT: కరోనా సమయంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి, టక్ జగదీశ్’ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు మహమ్మారి వల్ల ఓటీటీలో విడదల చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై నాని, నాని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ మాత్రం థియేటర్లోకి వచ్చింది. ఇక నాని మరో చిత్రం ఒకటి నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని ప్రోడక్షన్లో ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీట్ క్యూట్’. నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. చదవండి: వైరల్‌గా కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి ఫొటోషూట్ ఆంథాలజీ (పలు కథల నేపథ్యంలో సినిమా) సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 5 విభిన్న కథానాల నేపథ్యంలో సాగే ఈ సినిమా బాహుబలి కట్టప్ప సత్యరాజ్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, రూహాని శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని భావించి నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మీట్ క్యూట్ నేరుగా నెట్‌ఫ్లక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కానీ, దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ కథలో నేనే హీరో!
‘మళ్ళీరావా’ (2017), ‘దేవదాస్’ (2018) వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆకాంక్షా సింగ్ తాజాగా మరో తెలుగు సినిమా అంగీకరించారు. హీరో నాని తన సోదరి దీప్తీ ఘంటాని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’లో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ యాంథాలజీలో ఐదు భాగాలు ఉంటాయి. ఒక్కో భాగం ఇరవై నిమిషాల పాటు ఉంటుంది. ఈ భాగాల్లోని ఒక దాంట్లో ఆకాంక్ష లీడ్ రోల్ చేస్తున్నారు. తన పాత్ర గురించి ఆకాంక్ష మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు చేయని పాత్రను చేస్తున్నాను. ఈ కథలో నేనే హీరో’’ అన్నారు. -
Meet Cute Movie: నాని సినిమా అదాశర్మ!
‘హార్ట్ ఎటాక్’ బ్యటీ అదా శర్మ ఇక క్యూట్ గాళ్ అట. విషయం ఏంటంటే... ‘మీట్ క్యూట్’ త్రంలో ఓ లీడ్ రోల్‌కి అదాని తీసుకున్నారు. హీరో నాని సోదరి దీప్తీ ఘంట ‘మీట్ క్యూట్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురిలో అదా ఓ క్యూట్ గాళ్ అన్నమాట. ఈ చిత్రంలో తాను చేయనున్న పాత్ర గురించి అదా శర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రాల్లో నేను ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ రోల్‌ను ఈ సినిమాలో చేయనున్నాను. ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నాది లైట్ హార్టెడ్ రోలే అయినప్పటికీ ఆ సినిమా మేజర్‌గా కమర్షియల్ పంథాలో సాగుతుంది. కానీ ‘మీట్ క్యూట్’ చిత్రం డిఫరెంట్. ఈ సినిమాలో కొత్త అదాను చూస్తారు’’ అని పేర్కొన్నారు. హీరో నాని నిర్మిస్తున్న ఈ ‘మీట్ క్యూట్’లో ఐదుగురు హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ పేరు ఉందనే ప్రచారం సాగుతున్న తెలిసిందే.