actress adah sharma is playing one of the lead role in nani meet cute movie - Sakshi
Sakshi News home page

Meet Cute Movie: క్యూట్‌ గాళ్‌ అదా!

Published Sun, Jun 20 2021 10:28 AM | Last Updated on Sun, Jun 20 2021 11:20 AM

Meet Cute : Adah Sharma To Star In Her First Telugu romcom - Sakshi

‘హార్ట్‌ ఎటాక్‌’ బ్యటీ అదా శర్మ ఇక క్యూట్‌ గాళ్‌ అట. విషయం ఏంటంటే... ‘మీట్‌ క్యూట్‌’ త్రంలో ఓ లీడ్‌ రోల్‌కి అదాని తీసుకున్నారు. హీరో నాని సోదరి దీప్తీ ఘంట ‘మీట్‌ క్యూట్‌’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురిలో అదా ఓ క్యూట్‌ గాళ్‌ అన్నమాట.

ఈ చిత్రంలో తాను చేయనున్న పాత్ర గురించి అదా శర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రాల్లో నేను ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్‌ రోల్‌ను ఈ సినిమాలో చేయనున్నాను. ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాలో నాది లైట్‌ హార్టెడ్‌ రోలే అయినప్పటికీ ఆ సినిమా మేజర్‌గా కమర్షియల్‌ పంథాలో సాగుతుంది. కానీ ‘మీట్‌ క్యూట్‌’ చిత్రం డిఫరెంట్‌. ఈ సినిమాలో కొత్త అదాను చూస్తారు’’ అని పేర్కొన్నారు. హీరో నాని నిర్మిస్తున్న ఈ ‘మీట్‌ క్యూట్‌’లో ఐదుగురు హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ పేరు ఉందనే ప్రచారం సాగుతున్న తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement