
మహిళలకు శిక్షణ ఇస్తున్న దీప్తి
సీతమ్మధార(విశాఖఉత్తర): చదువుకున్నది ఎంబీఏ..ఇష్టమై ఎంచుకున్న రంగం ఫ్యాషన్ డిజైనర్. ఎంబీఏ పూర్తవ్వగానే ఉద్యోగంలో చేరినా మనసుకు నచ్చకపోవడంతో ఉద్యోగానికి విడిచిపెట్టి ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఎన్‌ఏడీకి చెంది దీప్తి. నేర్చుకున్న వృత్తిని పదిమందికీ ఉచితంగా పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.
చిన్నప్పటి నుంచి ట్రెండీగా ఉండడం ఇష్టం..పెరిగిన వాతావరణం ప్రభావమో ఏమో గానీ కొత్త కొత్త ఫ్యాషన్స్‌ను ఫాలో అవడం అలవాటైంది. క్రమంగా ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడాలని కోరుకున్నా...కానీ ఈ రంగానికి అంత భవిష్యత్తు ఉండదేమోనని అమ్మానాన్న ఫార్మసీ రంగంవైపు వెళ్లమని సూచించారు. దీంతో యలమర్తి ఫార్మసీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చదవా..తరువాత ఎంబీఏ చేశా.. కొన్నాళ్ల పాటు ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశా..కానీ చిన్నతనం నుంచి బలంగా నాటుకుపోయిన ఫ్యాషన్ రంగాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి క్రియేటివ్ ఫీల్డ్ అయిన ఫ్యాషన్ రంగాన్నే ఎంచుకున్నా...ప్రస్తుతం పది మందికి ఉచితంగా నేర్పించే స్థాయికి ఎదిగా..ప్రస్తుతం ఉన్న రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కష్టపడితేనే గానీ హ్యాపీగా జీవించే పరిస్థితి లేదు. నగరాలకు వస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచించా. ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న అనుభవంతో మహిళలకు ఉపాధి కల్పించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో ఉంటూనే ఎంతోకొంత ఆదాయం సంపాదించవచ్చు.
బీజం పడిందిలా..
ఓ ఫంక్షన్‌కు స్నేహితుడి ఇంటికి వెళ్లా..నేను వేసుకున్న డ్రెస్సే వేరే అమ్మాయి కూడా వేసుకుంది. ఎందుకో గిల్టీగా అనిపించింది. స్పెషల్‌గా ఉండడం చిన్నప్పటి నుంచి ఇష్టం. అందుకే నేను ధరించే దుస్తులే నేనే డిజైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే కొనసాగిస్తున్నా..2016లో నా పెళ్లి దుస్తులు కూడా నేనే డిజైన్ చేసుకున్నా..ఎన్‌ఏడీలో మా ఇంట్లోనే మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నా..
Comments
Please login to add a commentAdd a comment