
దీప్తి, ప్రవల్లిక
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక.
అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’.
Comments
Please login to add a commentAdd a comment