production house
-
కొత్తవారి కోసమే దిల్ రాజు డ్రీమ్స్: ‘దిల్’ రాజు
‘‘చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించేందుకే ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. దర్శక, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు, రచయితలు.. ఇలా ఆసక్తి ఉన్న ఎవరైనా మా టీమ్‌ని సంప్రదించవచ్చు. ఇందుకోసం నా బర్త్‌డే(డిసెంబరు 18) లేదా జనవరి 1న వెబ్ సైట్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్ రాజు డ్రీమ్స్’ లోగోను ఆయన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వస్తున్నట్టుగా, పోయినట్టుగా కూడా ఎవరికీ తెలీదు. ఎంత డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుసు.అందుకే ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయాలని, ప్రతిభ ఉన్న కొత్తవారికి సరైన వేదిక ఉండాలని ‘దిల్ రాజు డ్రీమ్స్’ను స్థాపించాను. ఇప్పటికే ఇద్దరు ఎన్నారై నిర్మాతలు ‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ సంస్థ కార్పోరేట్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారందరికీ జీతాలు ఇస్తాం. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తాం.. వాటిలో కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలని షరతు విధించాను. మంచి ప్రతిభావంతులకు నా బ్యానర్లో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సిఫారసులు ఉండవు. అందరూ వెబ్ సైట్ ద్వారానే సంప్రదించాలి’’ అని తెలిపారు. -
మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..
తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నేడు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారు? నెట్‌వర్త్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom) ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముంచే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! నెట్‌వర్త్ (Net Worth) చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. ఇదీ చదవండి: దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే? చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్ హౌస్' స్థాపించారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. -
కోహ్లి బావ గురించి తెలుసా? వందల కోట్లు పెట్టి..
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, అతని భార్య అనుష్క శర్మ గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ కోహ్లీకి స్వయానా బావ, అనుష్క శర్మ అన్న 'కర్నేష్ శర్మ' (Karnesh Sharma) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతడు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కూడా. రూ. కోట్లలో సంపాదిస్తున్న కర్నేష్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లీన్ స్లేట్ ఫిలింజ్.. బాలీవుడ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన కర్నేష్ శర్మ తన చెల్లెలు అనుష్క శర్మతో కలిసి 2013లో క్లీన్ స్లేట్ ఫిలింజ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ కొట్టి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. ఫిలౌరీ, NH10 సహా పలు హిట్ చిత్రాలను కూడా ఇందులోనే నిర్మించారు. నిజానికి కర్నేష్ శర్మ విజయ ప్రస్థానం అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్10తో ప్రారంభమైంది. రూ.30 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా రాణించలేదు, కానీ ఆ తరువాత మంచి యాక్షన్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఫిలౌరీ, పారి, బుల్బుల్ వంటివి కూడా మంచి హిట్స్ అందించాయి. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) కర్నేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఖాలా (Qala) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈయన తరువాత చిత్రం 'చక్‌దే ఎక్స్‌ప్రెస్'. ఇది ఇండియన్ క్రికెటర్ 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. (ఇదీ చదవండి: ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!) నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం.. కర్నేష్ శర్మ అండ్ అనుష్క శర్మల నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 400 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. దీని కింద ఎనిమిది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. చివరగా కర్నేష్ శర్మ నికర విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. -
కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్‌తో ఎంట్రీ ఇచ్చేసింది!
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ సరసన సీతగా కనిపించిన నటి కృతి సనన్ బిజినెస్ విమెన్‌గా కొత్త అవతారమెత్తింది. త్వరలోనే ప్రొడ్యూసర్‌గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలను నిజం చేస్తూ తన ప్రాజెక్ట్ వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పేరును బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సందడి మొదలైంది. (డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!) నిర్మాతగా అడుగుపెట్టిన కృతి సనన్ నిర్మాణ సంస్థ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌ను సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. అలాగే నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ ‘దో పట్టి’ అని ప్రకటించింది. ఇందుకోసం ముగ్గరు స్ట్రాంగ్, స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో జత కట్టినట్టు వెల్లడించింది కృతి. ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్‌తోపాటు, బాలీవుడ్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా ధిల్లాన్, రిచిక కపూర్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. ‘దో పట్టి’ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతోందట. అంతేకాదు కృతి ఎనిమిదేళ్ల విరామం తర్వాత దిల్‌వాలేలో, రోహిత్ శెట్టి, కాజోల్‌తో తిరిగి కలుస్తున్నట్టు కూడా పేర్కొంది. కృతి నిర్మాణ రంగంలోకి ప్రవేశించడమే కాకుండా రచయిత్రి కనికా ధిల్లాన్‌కి తొలి వెంచర్‌గా నెటిఫ్లిక్స్ను ఎంచుకున్నట్టు తెలిపింది. (అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్) 9 సంవత్సరాల డ్రీమ్ సాకారంలో బేబీ స్టెప్స్ వేసాను, నేర్చుకున్నాను, యాక్టర్‌గా ఎదిగాను! ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి బిట్‌ను, ప్రతీ అంశాన్ని లైక్ చేశా.. ఇపుడు నా కిష్టమైన, నచ్చిన ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి,మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.ఈ మ్యాజికల్ జర్నీని ప్రారంభించేందుకు రడీగా ఉన్నానంటూ తన సోదరి నూపర్ సనన్‌కి ట్యాగ్ చేస్తూ నిండు హృదయంతో, బిగ్ డ్రీంకి స్వాగతం అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపించారు. వరుణ్ ధావన్, హ్యూమా ఖురేషి, శోభితా ధూళిపాళ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కృతికి కంగ్రాట్స్ చెప్పారు. కాగా కృతి సనన్ టైగర్ ష్రాఫ్‌తో కలిసి సబ్బీర్ ఖాన్ హీరోపంతి (2014)లో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.బరేలీ కి బర్ఫీ, మిమీ వంటి మూవీల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్కమింగ్మూవీస్ విషయానికి వస్తే టబు , కరీనా కపూర్లతో కలిసి ‘ది క్రూ’, టైగర్ ష్రాఫ్‌తో కలిసి ‘గణపతి పార్ట్-1 లో నటిస్తోంది. View this post on Instagram Shared post on Time -
కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన రామ్ చరణ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి వీ మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ విక్రమ్ (విక్కీ), రామ్ చరణ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్) అలాగే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. 2017లో స్థాపించిన ఈ సంస్థ ఖైదీ నం.150 వంటి హిట్ సినిమాలను అందించింది. తాజాగా ప్రారంభించిన వీ మెగా పిక్చర్స్ బ్యానర్‌పై తీయనున్న చిత్రాల్లో కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు. యంగ్ టాలెంటెడ్ నటీనటులకు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘మా వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.' అన్నారు. యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ..'ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి "వి మెగా పిక్చర్స్" పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండస్ట్రీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం.' అన్నారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా.. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో ముఖ్య అతిథిగా చెర్రీ పాల్గొన్నారు. ఇండియా సినిమా గురించితన ఆలోచనలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: భర్తకు విడాకులిచ్చిన బుల్లితెర నటి? ఫోటోతో క్లారిటీ!) -
రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నార్త్‌లోనే కాకుండా సౌత్ అడియన్స్‌కి కూడా బాగా దగ్గరైంది. ఆర్ఆర్ఆర్లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో అలియా ముందు వరుసలో ఉంది. అయితే ఇది రంగుల ప్రపంచం. ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో తెలియదు. అందుకే ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని ఆలోచిస్తుంది అలియా. స్టార్ హీరోయిన్ ఫేమ్‌ని మరో వ్యాపారానికి వాడాలనుకుంటుంది. త్వరలోనే ఈ బ్యూటీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. దాని కోసం ఏకంగా రూ. 37 కోట్లు పెట్టి ముంబైలో ఓ ఇంటిని కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ ఇంటిని కొలుగోలు చేసిందట. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీనే రూ. 2.26 కోట్లు చెల్లించిందట. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా) ఇప్పటికే అలియా పేరిట రెండు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి తన సోదరి షహీన్‌కి విక్రయదానం చేసింది. దాని విలువ దాదాపు రూ. 8 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఎనిమిది అంతస్తుల భవనంలో నివాసం ఉంటుంది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లు షూటింగ్స్‌కి గ్యాప్ ఇచ్చిన అలియా.. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది. -
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
కొత్త కథలతో ఎస్ ఒరిజినల్స్.. ఏకంగా 9 సినిమాలు
S Originals Coming With 9 Movies With Different Concepts: ఈ సంవత్సరం ఏకంగా 9 సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది 'ఎస్ ఒరిజనల్స్'. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కథను నమ్మి కొత్త తరం దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు నిర్మాత సృజన్. తమ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై గురించి సృజన్ మాట్లాడుతూ 'ఎస్ ఒరిజినల్స్‌ను టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకు భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు మా బ్యానర్ నుంచే 9 చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల షూటింగ్ సుమారు ముగింపునకు రావడం సంతోషంగా ఉంది. దీని ద్వారా కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. టాలెంట్‌పై నమ్మకంతో వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇవే కాకుండా మరికొన్ని కథలను ఫైనలైజ్ చేసి ఈ ఏడాది ప్రారంభిస్తాం' అని తెలిపారు. ప్రస్తుతం పంచతంత్రం విడుదలకు సిద్ధంగా ఉందని సృజన్ పేర్కొన్నారు. 'సంతోష్ శోభన్ హీరోగా డిజిటల్ మీడియాలో బ్రాండ్‌గా ఎదిగిన సుభాష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపొదించాం. సుమంత్ హీరోగా అహాం చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయిన సినిమాతో సుబ్బు చెరుకూరిని కొత్త దర్శకుడిగా అరంగ్రేటం చేయనున్నారు. ఇంకొక కొత్త దర్శకుడిగా బ్రిజేష్‌తో వైరల్ సినిమా రానుంది. కిరణ్ డైరెక్షన్లో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నడలో బీర్బల్ ట్రయాలజీ తీసిన శ్రీని దర్శకత్వంలో ఓల్డ్ మంక్ మూవీని, కొత్త దర్శకుడు విష్ణును మరో సినిమాతో పరిచయం చేస్తున్నాం. బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్లో ఉంది.' అని సృజన్ వెల్లడించారు. కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం బలంగా ఉందని నిర్మాత సృజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎస్ ఒరిజినల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. -
ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ : తమ్మారెడ్డి
కొత్త తరహా చిత్రాలను నిర్మించేందుకు నిర్మాత జి.ఆర్.జి.ఎన్ రాజు సొంతంగా 'లేడి లయన్ క్రియేషన్స్ బ్యానర్' పేరిట సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సహా నిర్మాత గోవింద రాజులు బ్యానర్ లాంచ్ కార్యక్రమం సోమవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, రమేష్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు వీర శంకర్, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరికృష్ణ, మాదాల రవి, నాగబాల సురేష్ కుమార్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బ్యానర్ లోగో ను కె ఎస్ రామారావు విడుదల చేయగా, టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ఆడ సింహం అంటూ అదిరిపోయే బ్యానర్ ని మొదలెట్టిన నిర్మాత రాజు గారికి, దర్శకుడు చల్లా భానులకు అభినందనలు. ఈ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇండస్ట్రీ లో ఈ బ్యానర్ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలనీ కోరుతున్నాను అన్నారు. నిర్మాత రాజు మాట్లాడుతూ .. లేడి లయన్ బ్యానర్ పై సరికొత్త తరహా చిత్రాలు తెరకెక్కించే ఉద్దేశంతో ఈ బ్యానర్ ని మొదలెట్టాం. సినిమాలే కాకుండా ఓటిటి కోసం వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాం. చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో మా ప్రయత్నంగా లవ్ యూ ఎనిమి అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల అవుతుంది అన్నారు. -
నిర్మాతగా మారిన హీరోయిన్ తాప్సీ
‘‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కెరీర్ తేలికగా వెళ్లదని, ఎదుర్కోడానికి ఈత నేర్చుకుంటానని నాకు తెలియదు. కానీ నిలదొక్కుకున్నాను. నా ప్రతిభని, పనితీరుని నమ్మి, నా మీద ప్రేమాభిమానాలు కనబర్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు తాప్సీ. ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో తాప్సీ ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు. ‘సూపర్ 30’, ‘83’, ‘సూర్మ’, ‘ముబారకాన్’ వంటి చిత్రాలను నిర్మించి, ప్రస్తుతం తనతో ‘రష్మీ రాకెట్’ చిత్రాన్ని నిర్మిస్తున్న రచయిత ప్రంజల్ ఖంద్ దియాతో కలిసి తాప్సీ ‘బ్లర్’ అనే సినిమా నిర్మించనున్నారు. ‘‘నాలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడికొచ్చి నిలదొక్కుకోవాలనుకునేవాళ్లకు మా ప్రొడక్షన్ హౌస్ తలుపులు తెరిచి ఉంటాయి’’ అన్నారు తాప్సీ. జీ స్టూడియోస్‌తో కలిసి ‘బ్లర్’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో తాప్సీ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారు. ‘బీఏ పాస్’, ‘సెక్షన్ 375’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు. -
టాలీవుడ్లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే..
లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. KODI RAMAKRISHNA presents ! Kodi RamaKrishna's elder daughter @kodidivya announces her new production @KodiDivyaaEnt 's venturing into Production with @KiranAbbavaram 's #KA5 💥 A #ManiSharma Musical 🎹 Directed by #KaarthikShankar 🎬 pic.twitter.com/dgfnUkrFRg — Haricharan Pudipeddi (@pudiharicharan) July 15, 2021 -
నిర్మాతగా మారిన మెగాస్టార్ కుమార్తె
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారారు. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్‌గానే కాకుండా, తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుష్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మొదటగా ఓ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.(చదవండి : చిరు జుట్టుతో ఆడుకున్న సుష్మిత) కాగా, ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లో జరిగాయి. మెగాస్టార్ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సుష్మిత.. తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సుష్మితకు బెస్ట్ విషెస్ చెబతున్నారు. (చదవండి : టీవీ నటుడు సుశీల్ ఆత్మహత్య) -
డిజిటల్‌కి డిమాండ్
లాక్డౌన్ తర్వాత వ్యక్తిగా, ఆర్టిస్టుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నారు కంగనా రనౌత్. ‘‘లాక్డౌన్ తర్వాత మన సినిమాలు, వాటి బిజినెస్‌లు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కూడా ఇప్పుడే ఊహించలేం. కొన్ని కథలను థియేటర్స్‌లో చూస్తేనే చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తే భవిష్యత్‌లో డిజిటల్ మీడియమ్‌కి డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. నటిగా నేను సక్సెస్ అయ్యాను. సినిమాలు చేస్తున్నాను. నేను కూడా ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాను. భవిష్యత్‌లో డిజిటల్ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా నేను సాధించాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘తలైవి’, ‘తేజస్’, ‘థాకడ్’ అనే మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కంగనా చేతిలో ఉన్నాయి. -
‘ఎన్‌హెచ్‌కే’ ఏర్పాటు వైపు ఎన్టీఆర్ అడుగులు?
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’అనే ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. తమకున్న క్రేజ్‌ను కాసులుగా మల్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని, నితిన్, సందీప్ కిషన్ లాంటి వాళ్లందరూ ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. తమ సినిమాల్లో వీటిని భాగస్వామ్యం చేసి లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం చేరబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఎన్‌హెచ్‌కే(నందమూరి హరికృష్ణ) ఆర్ట్స్ బ్యానర్ పేరిట సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన తదుపరి సినిమాల్లో ఎన్‌హెచ్‌కే నిర్మాణ సంస్థను భాగస్వామిని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్హెచ్కేను స్లీపింగ్ పార్ట్నర్గా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడట ఎన్టీఆర్. ఇక తన తదుపరి అన్ని చిత్రాల్లో ఎన్‌హెచ్‌కే స్లీపింగ్ పార్ట్నర్గా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నడని టాలీవుడ్ టాక్. ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తమిత్తుడైన ఒకరు చూసుకుంటారని సమాచారం. నటుడిగా గొప్ప విజయాలను అందుకున్న ఎన్టీఆర్.. నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. చదవండి: జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
మంచు మనోజ్ కొత్త ప్రయాణం
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మరో సరికొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు హీరోగా అభిమానులను అలరించిన ఈ యంగ్ హీరో.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’పేరిట సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ఆదివారం ప్రారంభించారు. దీపావళి పర్వదినాన సొంత ప్రొడక్షన్ హౌజ్‌కు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త జర్నీలో అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రొడక్షన్ హౌజ్‌కు సంబంధించిన లోగోను కూడా మంచు మనోజ్ విడుదల చేశారు. ‘కొత్త జర్నీ ప్రారంభమైంది. నా సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’నిర్మాణంలోనే నా తదుపరి సినిమాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌ను వెలికితీయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌లో మా ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చే మంచి సినిమాలను మీరు చూస్తారు. ఎమ్ఎమ్ ఆర్ట్స్ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్ యూ ఆల్’ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఇక మంచు ఫ్యామీలీకి నిర్మాణ రంగం కొత్తదేమి కాదు. ఇప్పటికే మోహన్ బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో పలు చిత్రాలని నిర్మించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక మంచు మనోజ్ కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిండంపై టాలీవుడ్ హర్హం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా మంచు మనోజ్ నిర్మాణ రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పలువరు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. On this festival occasion, i am happy to announce that i have started my production house "MM Arts" and here are the details. Need all ur love and blessings for this new journey of mine ❤️#HappyDiwali everyone 😍#MMArts pic.twitter.com/chRL9sYCwH — MM*🙏🏻❤️ (@HeroManoj1) October 27, 2019 -
సినిమాలు తీస్తా
బాలీవుడ్ బెస్ట్ యంగ్ హీరోస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఒకరు. హీరో కాకముందు షారుక్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ (2010) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు సిద్ధార్థ్. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు కదా. హీరోగా రాణిస్తున్న మీరు భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తారా? అనే ప్రశ్న ఈ కుర్ర హీరో ముందు ఉంచితే.... ‘‘షారుక్గారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మొదట్నుంచి నాకు ఫిల్మ్ మేకింగ్‌పై స్పెషల్ ఫోకస్ ఉంది. భవిష్యత్‌లో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. డైరెక్షన్ గురించి మాత్రం ఇప్పుడేం చెప్పలేను’’ అన్నారు. ‘మర్జావాన్’ మూవీ సిద్ధార్థ్ నెక్ట్స్ రిలీజ్. ప్రస్తుతం ‘షేర్షా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. -
గురువుతో నాలుగోసారి
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్నది సామెత. ఈ విషయాన్ని కొందరు కథానాయికలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాదు.. ఇతర వ్యాపారాలు, ప్రొడక్షన్ వైపు కూడా అడుగులేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. టాలీవుడ్లో తన నట గురువు తేజ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా నిర్మించి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్లో నటించనున్నారట. ఇందుకోసం లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌ను తేజ సిద్ధం చేస్తున్నారని, సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని టాక్. 2007లో వచ్చిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారు తేజ. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మంచి విజయం అందుకుంది. గత నెలలో వచ్చిన ‘సీత’ చిత్రంతో మూడోసారి కలిసి పనిచేసిన తేజ–కాజల్ ఇప్పుడు నాలుగోసారి కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారట. -
కొత్త రచయితల కోసం...
‘ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. ‘‘ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలంటే మూడు ముఖ్యాంశాలు కావాలి.. అందులో మొదటిది కథ, రెండోది కథ, మూడోది కూడా కథే. ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ చెప్పిన ఈ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను’’ అని మహి వి. రాఘవ్ తెలిపారు. శివమేక, రాకేష్ మంహకాళి వంటి సన్నిహితులతో కలసి ‘త్రీ ఆటమన్ లీవ్స్’ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించారు మహి. ‘‘సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా మా సంస్థ అడుగులు వేస్తుంది. ఔత్సాహికులైన రచయితల్ని, సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న యువ ఫిల్మ్ రైటర్స్‌ని ప్రోత్సహిస్తూ వారి చేత కొత్త కథల్ని తయారు చేయించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. కథలకి, కథకులకి డబ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్‌ని పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు మా సంస్థ ముందుంటుంది. ‘యాత్ర’ సినిమాకి ‘త్రీ ఆటమన్ లీవ్స్’ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించింది. ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రోత్సహించే నిర్మాణసంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు మా సంస్థ ముందుంటుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీ రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, చానల్ పార్టనర్స్‌తో జతకలిసేందుకు ‘త్రీ ఆటమన్ లీవ్స్’ సంస్థ సుముఖంగా ఉంది’’ అన్నారు. -
‘మరోసారి అతనితో నటించాలని ఉంది’
ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ నిర్మాతగా మారుతున్నారు. ‘ఇరానీ మూవీటోన్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. బాలీవుడ్ సుపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇరానీ మూవీటోన్ సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నా’నని తెలిపారు అమితాబ్. అంతేకాక ‘మరోసారి బొమన్ ఇరానీతో కలిసి నటించాలనుకుంటున్నాను. కానీ దేవుని దయ వల్ల ఈసారి అతను నన్ను అధిగమించకూడదని ఆశిస్తున్నాను’ అంటూ బిగ్ బీ చమత్కరించారు. అమితాబ్, బొమన్ ఇరానీ నటించిన ‘వక్త్ : ది రేస్ ఎగెనెస్ట్ టైమ్’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వీరద్దరు పండించిన కామెడీ అద్భుతం. ఈ నిర్మాణ సంస్థ గురించి బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి వారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేనూ అలాగే ఉంటా!
బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్‌లు యాక్టింగ్‌ను ప్లాన్ ఏ గా భావించి ప్లాన్ బీగా నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఇప్పుడీ జాబితాలోకి మరో నటి రిచా చద్దా చేరారు. ఆమె కూడా ప్లాన్ బీగా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘‘ఒక్క యాక్టింగ్ పరంగానే కాదు వీలైనన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను భాగం అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా మారే అవకాశం వచ్చింది. న్యూయార్క్‌కి చెందిన నా క్లోజ్ ఫ్రెండ్ సుచంటి తలాటి ఓ టీనేజ్ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఆమె నన్ను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయమని అడిగినప్పుడు నిర్మాతగా నాకు ఇదొక అవకాశంగా కనిపించింది. ఈ రోజుల్లో అందరూ ఒక్క పనితోనే ఆగిపోవడం లేదు. మల్టిఫుల్ వర్క్స్ చేస్తున్నారు. నేనూ అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు. ప్రస్తుతం షకీల బయోపిక్ ‘షకీల’లో ఆమె æనటిస్తున్నారు. -
నీదీ నాదీ ఒకే దారి
‘ఇష్క్ జాదే’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా. తాజాగా ‘నమస్తే లండన్’ సినిమాలో కలసి యాక్ట్ చేశారు. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ ప్రొడ్యూసర్స్‌గా మారనున్నారట. ప్రస్తుతానికి సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసే ప్లాన్ వేస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలెట్టారని బాలీవుడ్ టాక్. అర్జున్ కపూర్ తాత సురీందర్ కపూర్, తండ్రి బోనీ కపూర్ ఆల్రెడీ బడా ప్రొడ్యూసర్స్. అయితే తన ఆలోచనలకు తగ్గ సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యంగ్ హీరో సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాడట. అలాగే పరిణీతీ చోప్రా తన కజిన్ ప్రియాంకలానే నిర్మాతలా మారాలనుకున్నారట. ఒకేసారి హీరో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఇద్దరూ ఒకేసారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలనుకోవడం విశేషం. అన్నట్లు.. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని టాక్. -
రిలయన్స్ మరో సంచలనం : షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్
న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించి బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో తన పాగా వేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీస్తుంది. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా షార్ట్‌ఫిల్మ్స్, సీరియల్స్‌ను నిర్మించాలని ఆర్ఐఎల్ భావిస్తోంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ కేవలం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందించనుందట. కేవలం రిలయన్స్ జియో సబ్స్క్రైబర్స్ మాత్రమే వెబ్ సీరిస్‌లో వీటిని వీక్షించవచ్చని తెలిసింది. టెలికాం మార్కెట్లో పోటీని తట్టుకుని అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో తనకున్న 215 మిలియన్ వైర్లెస్ యూజర్ బేస్‌కు మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి వైర్డ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంతో కంపెనీ వుంది. జియో సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే కంటెంట్ అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వచ్చే 6 నెలల్లో కొన్ని వెబ్‌సిరీస్‌లను రిలీజ్ చేసే అంచనాతో ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. టారిఫ్‌లు భారీగా తగ్గడంతో మొబైల్ డేటా వినియోగం అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియాలను వీక్షించే సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై పలు షోలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. దీంతో సొంత ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. దీని కోసం రిలయన్స్ కంటెంట్ క్రియేటర్స్, స్క్రిప్‌రైటర్స్‌ను నియమించుకుంది. ఈ ప్రక్రియలోనే రిలయన్స్ అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించబోతుందని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఎరోస్ గ్రూప్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి దేశ్ పాండేను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన మీడియా, ఎంటర్టైన్మెంట్కు అధిపతిగా నియమించుకుందని తెలిసింది. తాజాగా 20 నుంచి 25 మంది క్రియేటివ్ వ్యక్తులు కూడా బోర్డులో జాయిన్ అయ్యారు. మీడియా ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌తో జియో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. రిలయన్స్ త్వరలో కంటెంట్ ఆఫరింగ్ కోసం మరికొన్ని టేకోవర్లు చేసే యోచనలో ఉందని తెలిసింది. -
అందుకే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశా
తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు సుధీర్‌బాబు. ఇప్పుడు ఆయన ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘తన సమర్థత మీద ప్రయాణించే మంచి మనసున్న వ్యక్తి సు«ధీర్బాబు. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను’’అన్నారు. ‘‘సుధీర్‌బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్ నిర్మాతగా సుధీర్‌బాబు పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను’’అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘ ఏదో ఒకరోజు నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసే స్టేజ్‌లో ఉంటే కొత్తవాళ్లను తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అలాగే స్టార్ట్ చేశా. కృష్ణగారు, మహేశ్ వాళ్లను వాడేసుకుని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. సొంతంగా ఎదగాలని కోరుకుంటాను. అందులో ఒక తృప్తి ఉంటుంది. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు చేయాలన్నదే నా విజన్. ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. అయ్యా. దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. బయటి ప్రొడక్షన్లో కూడా నటిస్తాను. మా బ్యానర్లో రాబోతున్న తొలి సినిమా షూటింగ్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో తుదిదశకు చేరుకుంది. మంచి సందర్భం చూసుకుని ఇలాగే గ్రాండ్‌గా ఈ సినిమా గురించి ప్రకటిస్తాం. ఇప్పుడు ఏ విషయం ఎనౌన్స్ చేయడం లేదు. ఎందుకంటే నేను హీరోగా చేసిన ‘సమ్మోహనం’ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకే ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేద్దామనుకోవడం లేదు. అందుకే బ్యానర్ లాంచ్ వరకు మాత్రమే పెట్టాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సందీప్ కిషన్, దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకరలతోపాటు చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పీసీ, అనుష్క బాటలో దీపికా
సాక్షి, న్యూఢిల్లీ : అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాల తర్వాత మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అనుష్క శర్మ ఇప్పటికే ఎన్‌హెచ్ 10, ఫిలౌరి, పారి వంటి విజయవంతమైన చిత్రాలను తన బేనర్ క్లీన్‌స్లేట్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కించగా ప్రియాంక చోప్రా పర్పుల్ పెబెల్స్ ప్రొడక్షన్ హౌస్ పేరిట పలు ప్రాంతీయ చిత్రాలను నిర్మించారు. తాజాగా పద్మావత్‌పై ఘనవిజయం అందుకున్న దీపికా పడుకోన్ సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంటెంట్ ఆధారిత చిత్రాలను నిర్మించేందుకు త్వరలోనే ఆమె నిర్మాతగా మారనున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలోనే ఆమె పలు సందర్భాల్లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడతానని ప్రకటించారు. అభిరుచికి తగిన చిత్రాలతో ముందుకొస్తానని, కేవలం సొమ్ముచేసుకునేందుకే ప్రొడ్యూసర్ కాబోనని గతంలో దీపికా పేర్కొన్నారు.ఇక ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి ఆమె విశాల్ భరద్వాజ్ మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో రణ్వీర్ సింగ్‌తో ఆమె వివాహం జరగనుందని వార్తలొచ్చాయి.