తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నేడు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారు? నెట్‍వర్త్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom)
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser)
చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముంచే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే.
రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)
ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.
ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
నెట్‍వర్త్ (Net Worth)
చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు.
ఇదీ చదవండి: దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే?
చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్ హౌస్' స్థాపించారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్‌లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment