ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్‌గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్‌వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం.
1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్‌గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు.
దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు.
నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది.
ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్‌కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్‌ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్‌గా భారీ మొత్తంలోనే సంపాదించాడు.
నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్‌ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్‌వేర్ ట్యుటోరియల్‌లో కూడా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment