ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్( పార్ట్ 1)’ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాకి తాజాగా జాతీయ అవార్డ్ దక్కింది. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఈ తరుణంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
అల్లు అర్జున్ తొలి సినిమా గంగ్రోతి. అయితే.. అంతకు ముందు ఆయన బాలనటుడిగానూ ఓ రెండు చిత్రాల్లో, చిరంజీవి డాడీ చిత్రంలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆపై.. 21ఏళ్ల వయస్సులో రాఘవేంద్ర రావు డైరెక్షన్‌లో గంగోత్రితో వెండి తెరకు పరిచయమయ్యారు. కానీ, అంతకంటే ముందే యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆయన మొదటి జీతం రూ.3,500 మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ద్వారా అత్యంత డిమాండ్, అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు.
అల్లు అర్జున్ ఆస్తులు ఎంతంటే
పలు నివేదికల ప్రకారం.. టాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.410 కోట్లు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే ఉంటుంది. పార్లే ఆగ్రోఫ్రూటీ, రెడ్ బస్, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు విషయంలోనూ ఆయన కోట్లలో పారితోషకం అందుకుంటూ ‘తగ్గేదే లే’ అనిపిస్తున్నారు.
ఖరీదైన కార్ కలెక్షన్
అల్లు అర్జున్ ట్యాగ్ లైన్ స్టైలిష్ స్టార్. దుస్తులు, గాడ్జెట్స్, షూ.. ఇలా అన్నింటా ఆ ట్యాగ్‌లైన్ కనిపిస్తుంటుంది. కానీ, డీ గ్లామర్.. అదీ పక్కా మాస్ రోల్‌తో ఆయన పుష్పగాడిగా విశేష ఆదరణ దక్కించుకోవడం గమనార్హం. ఇక.. ఆయనకు కార్లుంటే మహా ఇష్టం. రేంజ్ రోవర్ వోగ్ కారును రూ. 2.50 కోట్లు, వానిటీ వ్యాన్ రూ. 7 కోట్లు, బీఎండబ్ల్యూ ఎక్స్ 5 రూ. 80 లక్షలు, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ రూ. 1.20 కోట్లు, ఆడి ఏ7 రూ. 86 కోట్ల వెచ్చించి కొనుగోలు చేశారు.
వ్యాపారాలతో పాటు
హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు పలు వ్యాపారాలు సైతం ఉన్నాయి. సినిమా థియేటర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. రూ.100 కోట్ల ఖరీదైన భవనం ఉంది. ఉదయపూర్‌లో నిహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వెళుతున్నప్పుడు అతను తన జెట్ ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేశాడు. దీంతో పాటు నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ (ప్రొడక్షన్ హౌస్), ఆశీర్వాదం(ఫార్మ్ హౌస్), జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment