నన్నెందుకు పిలవలేదు? ఆనంద్‌ మహీంద్రాను ప్రశ్నించిన చరణ్‌ | Funny Conversation Between Ram Charan And Anand Mahindra In Twitter X Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ram Charan: సుజిత్‌ పెళ్లికి ఎందుకు పిలవలేదు?.. ఆనంద్‌ మహీంద్రా ఆన్సరిదే!

Published Sun, Mar 24 2024 12:45 PM | Last Updated on Sun, Mar 24 2024 2:34 PM

Ram Charan, Anand Mahindra Funny Conversation - Sakshi

సుజీత్‌ పెళ్లికి తనను ఎందుకు పిలవలేని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించాడు చరణ్‌.. దీంతో ఆనంద్‌ మహీంద్రా అయ్యో.. మర్చిపోయానంటూ ఫన్నీ రిప్లై ఇచ్చా

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా మధ్య సరదా సంభాషణ జరిగింది. సుజీత్‌ పెళ్లికి తనను ఎందుకు పిలవలేని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించాడు చరణ్‌.. దీంతో ఆనంద్‌ మహీంద్రా అయ్యయ్యో.. మర్చిపోయానంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌ ముఖచిత్రాన్ని మహీంద్రా ఎలా మార్చాడో ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

ఫ్యాక్టరీతో పాటు..
'జహీరాబాద్‌లో మహీంద్రా ఒక ఫ్యాక్టరీని నిర్మించడంతో పాటు లక్షలాది చెట్లను నాటాడు. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ ఏర్పాటు చేయించడంతో అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులకు పెరిగింది. అప్పటివరకు నీటి ఎద్దడి వల్ల గ్రామస్తుడు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అతడే కాదు ఆ ఊర్లో ఉన్న ఎవరికీ పిల్లనిచ్చేందుకు చుట్టుపక్కల ఊరివాళ్లు ముందుకు రాలేదు. ఇప్పుడా నీటిసమస్య తీరిపోవడంతో ఊళ్లో పెళ్లి బాజాలు మొదలయ్యాయి. సుజిత్‌ పెళ్లి జరిగింది' అని చెప్పుకొచ్చారు.

ఎంజాయ్‌ చేసేవాడిని
దీనిపై చరణ్‌ ప్రశంసలు కురిపిస్తూ.. 'ఆనంద్‌ మహీంద్రా, సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు. నేను అక్కడికి దగ్గర్లోనే ఉంటాను. జహీరాబాద్‌లో నా ఫ్రెండ్స్‌ను కలిసి ఎంజాయ్‌ చేసేవాడిని. ఏదేమైనా మీరు చేసింది చాలా గొప్ప పని' అని మెచ్చుకున్నారు. ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. 'నేను అంగీకరిస్తున్నాను. అప్పుడు నేను గందరగోళంలో ఉన్నాను.. అందువల్లే పెళ్లికి ఆహ్వానించలేకపోయాను.

ఈసారి మిస్‌ అవ్వను.. అందుకే!
ఇప్పుడేమో మీ శిక్షణ ఆధారంగా నా డ్యాన్స్‌ మెరుగుపర్చుకునే పనిలో ఉన్నాను. మా ప్రకటన పట్ల స్పందించినందుకు థ్యాంక్స్‌.. ఇది ఎంతో సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నాను. ఈసారి నేను మిస్‌ అవ్వాలనుకోవడం లేదు. అందుకే అడ్వాన్స్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని ట్వీట్‌ చేశాడు. దీనికి చరణ్‌.. థాంక్యూ, త్వరలోనే కలుద్దామంటూ రిప్లై ఇచ్చాడు.

చదవండి: Pawan Kalyan: నటుడా? నాయకుడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement