ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ జీవిత చరిత్ర గురించి అమెరికన్ ప్రముఖ రచయిత వాల్టర్ ఐజాక్సన్ రచించారు. తన బయోగ్రఫీలో మస్క్ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎలాన్ మస్క్‌ను భారతీయ యువకులు కూడా ఐకాన్‌గా గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జీవితం త్వరలో సినిమాగా కూడా రాబోతుంది. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివి..? వంటి అంశాలపై ప్రధానంగా చూపుతూ సినిమాను నిర్మించనున్నారు.
ఈ మేరకు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ మస్క్ బయోపిక్ తీసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పుస్తక రచయిత వాల్టర్ ఐజాక్సన్ నుంచి ఆ నిర్మాణ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ఎంతో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కను ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ డారెన్ ఆర్‌న్ఫోస్కీ తెరకెక్కించనున్నారు. హాలీవుడ్‌లో బ్లాక్ స్వాన్, పై, ది వేల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కానీ మస్క్ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలను ఇప్పటికైతే వెల్లడించలేదు.
ఎలన్ మస్క్ కుటుంబ విషయాలు
ఎలన్ మస్క్ కు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అతని తమ్ముడు కింబాల్ మస్క్ అమెరికాలో కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ యజమాని, చెల్లెలు తోస్కా చిత్రనిర్మాత. కాగా మస్క్‌కు ఏడుగురు పిల్లలు ఉన్నారు, వీరంతా అబ్బాయిలే. వారిపేర్లు ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్, నెవాడా అలెగ్జాండర్ మస్క్, గ్రిఫిన్ మస్క్, జేవియర్ మస్క్, డామియన్ మస్క్, సాక్సన్ మస్క్, కై మస్క్ వీళ్లంతా కృత్తిమంగా జన్మించారు.
Comments
Please login to add a commentAdd a comment