ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. కల్కిలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు.
అయితే హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో ఈ సినిమాలోని బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. విభిన్నమైన డిజైన్‌తో రూపొందించిన కారు(బుజ్జి) లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జి అన్ని ప్రధాన నగరాల్లో సందడి చేస్తోంది. తాజాగా ఈ బుజ్జిని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. కల్కి సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.
#Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/4VQCe3hSSv
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 12, 2024
Comments
Please login to add a commentAdd a comment