సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్‌కి అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్‌డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్‌రూమ్‌లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ బ్యాక్‌యార్డ్‌లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి.
ప్రైవేట్ జెట్
విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్‌లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్‌లోనేఎగిరిపోతారు.
లగ్జరీ కార్ల సముదాయం
సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్‌లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి.
ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్‌లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్‌తో పాటు మోహన్‌లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.
కాగా కెరీర్‌లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్‌డూపర్ హిట్‌లను అందించిన టాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్‌మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment