నిర్మాతగా మారుతున్న హీరో | akkineni family hero sumanth starts new production house | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న హీరో

Oct 28 2015 2:56 PM | Updated on Jul 15 2019 9:21 PM

నిర్మాతగా మారుతున్న హీరో - Sakshi

నిర్మాతగా మారుతున్న హీరో

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తరువాత హీరోగా నిలదొక్కులో లేకపోయిన వారసుడు సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో 'సత్యం', 'గౌరి' లాంటి హిట్ సినిమాల్లో నటించినా...

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, తరువాత హీరోగా నిలదొక్కుకో లేకపోయిన వారసుడు సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో  'సత్యం', 'గౌరి' లాంటి హిట్ సినిమాల్లో నటించినా, ఆ సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

అయితే నటుడిగా ఆశించిన స్ధాయి విజయం సాధించలేకపోయిన సుమంత్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీపై స్వయంగా ప్రకటించిన అతడు త్వరలోనే తన బ్యానర్లో సినిమా మొదలు పెడతానని తెలిపాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో వెంకట్, నాగార్జునలు నిర్మాతలుగా మంచి విజయాలు సాధించగా, సుమంత్ సోదరి సుప్రియ కూడా నాగార్జున నిర్మించిన పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే బాటలో సుమంత్ కూడా సక్సెస్ఫుల్ నిర్మాతగా మారాలని ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement