
‘‘నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కెరీర్ తేలికగా వెళ్లదని, ఎదుర్కోడానికి ఈత నేర్చుకుంటానని నాకు తెలియదు. కానీ నిలదొక్కుకున్నాను. నా ప్రతిభని, పనితీరుని నమ్మి, నా మీద ప్రేమాభిమానాలు కనబర్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు తాప్సీ. ‘అవుట్‌సైడర్స్ ఫిల్మ్స్’ పేరుతో తాప్సీ ఓ నిర్మాణ సంస్థను ఆరంభించారు.
‘సూపర్ 30’, ‘83’, ‘సూర్మ’, ‘ముబారకాన్’ వంటి చిత్రాలను నిర్మించి, ప్రస్తుతం తనతో ‘రష్మీ రాకెట్’ చిత్రాన్ని నిర్మిస్తున్న రచయిత ప్రంజల్ ఖంద్ దియాతో కలిసి తాప్సీ ‘బ్లర్’ అనే సినిమా నిర్మించనున్నారు. ‘‘నాలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడికొచ్చి నిలదొక్కుకోవాలనుకునేవాళ్లకు మా ప్రొడక్షన్ హౌస్ తలుపులు తెరిచి ఉంటాయి’’ అన్నారు తాప్సీ. జీ స్టూడియోస్‌తో కలిసి ‘బ్లర్’ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో తాప్సీ లీడ్ క్యారెక్టర్ చేయనున్నారు. ‘బీఏ పాస్’, ‘సెక్షన్ 375’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ బెహల్ ఈ చిత్రానికి దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment