Alia Bhatt Buys Swanky Apartment Worth Whopping Rs 37 Crore In Mumbai's Pali Hill: Report - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఖరీదైన ఇల్లు కొన్నఅలియా భట్‌.. ఆ వ్యాపారం కోసమేనట!

Apr 25 2023 9:15 AM | Updated on Apr 25 2023 10:40 AM

Alia Bhatt Buys New House In Mumbai For Whopping RS 37 Crore - Sakshi

బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లలో అలియా భట్‌ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నార్త్‌లోనే కాకుండా సౌత్‌ అడియన్స్‌కి కూడా బాగా దగ్గరైంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో అలియా ముందు వరుసలో ఉంది. అయితే ఇది రంగుల ప్రపంచం. ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో తెలియదు. అందుకే ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని ఆలోచిస్తుంది అలియా. స్టార్‌ హీరోయిన్‌ ఫేమ్‌ని మరో వ్యాపారానికి వాడాలనుకుంటుంది.

త్వరలోనే ఈ బ్యూటీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. దాని కోసం ఏకంగా రూ. 37 కోట్లు పెట్టి  ముంబైలో ఓ ఇంటిని కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధించిన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిట ఆ ఇంటిని కొలుగోలు చేసిందట. ఇందుకు సంబంధించి స్టాంప్‌ డ్యూటీనే రూ. 2.26 కోట్లు చెల్లించిందట. 

(చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా)

ఇప్పటికే అలియా పేరిట రెండు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి తన సోదరి షహీన్‌కి విక్రయదానం చేసింది. దాని విలువ దాదాపు రూ. 8 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఎనిమిది అంతస్తుల భవనంలో నివాసం ఉంటుంది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లు షూటింగ్స్‌కి గ్యాప్‌ ఇచ్చిన అలియా.. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement