దీపికా పదుకోన్
ఈ తరం హీరోయిన్లు సినిమాల సెలక్షన్స్ విషయంలో భలే తెలివిగా వ్యవహరిస్తున్నారు. లైఫ్‌ని ప్లాన్ చేసుకునే విషయంలోనూ అంతే తెలివిగా ఉంటున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోక ముందే ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేలా అడుగులు వేస్తున్నారు. ఏదైనా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడమో లేక సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టడమో చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంకా చోప్రా పర్పుల్ పెబ్లీ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి మూడు సినిమాలను నిర్మించారు.
మరో అరడజను సినిమాలను లైన్లో పెట్టారు. భోజ్‌పురి, పంజాబీ, మరాఠి, అస్సామి భాషల్లో ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. అనుష్కా శర్మ కూడా క్లీన్ స్లేట్ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించారు. సొంత బ్యానర్‌లోనే సహ నిర్మాతగా ఉంటూనే నటించారు అనుష్క. ఇప్పుడు ప్రియాంక, అనుష్క బాటలోనే దీపికా పదుకోన్ కూడా వెళ్లాలనుకుంటున్నారు. కొత్తగా ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కొత్త యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్‌కు తన బ్యానర్‌లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు.
‘‘నిర్మాణ సంస్థను స్థాపించాలన్న ఆసక్తి ఉంది. కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సినిమాలను నిర్మించాలి. అందుకు ప్లానింగ్ ఉండాలి. నేను పక్కా ప్లానింగ్‌తోనే నిర్మాతగా మారుతున్నా. నేను నటించే సినిమాల్లో నా విజన్‌ని చూపించే అవకాశం ఉండదు. అదే నేను నిర్మించే సినిమాలకు నా విజన్‌ను తెరపై చూపించే అవకాశం దొరుకుతుంది. అందుకే సినిమాలు నిర్మించాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు దీపిక.
Comments
Please login to add a commentAdd a comment