మంచు మనోజ్‌ కొత్త ప్రయాణం | Manchu Manoj Started New Own Production House | Sakshi
Sakshi News home page

కొత్త జర్నీ మొదలుపెట్టిన మంచు మనోజ్‌

Published Sun, Oct 27 2019 2:37 PM | Last Updated on Mon, Oct 28 2019 9:49 AM

Manchu Manoj Started New Own Production House - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ మరో సరికొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు హీరోగా అభిమానులను అలరించిన ఈ యంగ్‌ హీరో.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయాలనే ఉద్దేశంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’పేరిట సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఆదివారం ప్రారంభించారు. దీపావళి పర్వదినాన సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌కు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కొత్త జర్నీలో అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రొడక్షన్‌ హౌజ్‌కు సంబంధించిన లోగోను కూడా మంచు మనోజ్‌ విడుదల చేశారు. 

‘కొత్త జర్నీ ప్రారంభమైంది. నా సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి సినిమాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌ను వెలికితీయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌లో మా ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి వచ్చే మంచి సినిమాలను మీరు చూస్తారు.  ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌’ అంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. ఇక మంచు ఫ్యామీలీకి నిర్మాణ రంగం కొత్తదేమి కాదు. ఇప్పటికే మోహన్ బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో పలు చిత్రాలని నిర్మించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక మంచు మనోజ్‌ కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిండంపై టాలీవుడ్‌ హర్హం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా మంచు మనోజ్‌ నిర్మాణ రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పలువరు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement