నీదీ నాదీ ఒకే దారి | Arjun Kapoor & Parineeti Chopra to set up individual production houses | Sakshi
Sakshi News home page

నీదీ నాదీ ఒకే దారి

Published Sat, Oct 6 2018 5:50 AM | Last Updated on Sat, Oct 6 2018 5:50 AM

Arjun Kapoor & Parineeti Chopra to set up individual production houses - Sakshi

అర్జున్‌ కపూర్, పరిణీతీ చోప్రా

‘ఇష్క్‌ జాదే’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు అర్జున్‌ కపూర్, పరిణీతీ చోప్రా. తాజాగా ‘నమస్తే లండన్‌’ సినిమాలో కలసి యాక్ట్‌ చేశారు. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ ప్రొడ్యూసర్స్‌గా మారనున్నారట. ప్రస్తుతానికి సొంతంగా ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేసే ప్లాన్‌ వేస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలెట్టారని బాలీవుడ్‌ టాక్‌.

అర్జున్‌ కపూర్‌ తాత సురీందర్‌ కపూర్, తండ్రి బోనీ కపూర్‌ ఆల్రెడీ బడా ప్రొడ్యూసర్స్‌. అయితే తన ఆలోచనలకు తగ్గ సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యంగ్‌ హీరో సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేస్తున్నాడట. అలాగే పరిణీతీ చోప్రా తన కజిన్‌ ప్రియాంకలానే నిర్మాతలా మారాలనుకున్నారట. ఒకేసారి హీరో హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఈ ఇద్దరూ ఒకేసారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలనుకోవడం విశేషం. అన్నట్లు.. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement