టాలీవుడ్‌లోకి కోడి రామకృష్ణ కూతురు ఎంట్రీ.. హీరో ఎవరంటే.. | Kodi Ramakrishnas Younger Daughter Divya Deepthi Turns As Producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారిన కోడి రామకృష్ణ కూతురు

Published Thu, Jul 15 2021 10:55 AM | Last Updated on Thu, Jul 15 2021 1:31 PM

Kodi Ramakrishnas Younger Daughter Divya Deepthi Turns As Producer - Sakshi

లెజెండరీ డైరెక్టర్‌ కోడి రామ‌కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. అమ్మోరు,  దేవి, అరుంధతి చిత్రాలు ఆ కోవలోకి వచ్చినవే. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలు రూపొందించి పలు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నారు. అనారోగ్యంతో 2019 ఫిబ్ర‌వ‌రి 22న కోడి రామ‌కృష్ణ మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఆయన వారసురాలు సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు దివ్య ప్రకటించారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement