ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య | Actress Divya Pillai Comments On Romantic Scenes | Sakshi
Sakshi News home page

Divya Pillai: చాలా వర్కౌట్ చేయాలి.. ఎంజాయ్ చేయడం అస్సలు ఉండదు

Published Mon, Apr 29 2024 10:46 AM | Last Updated on Mon, Apr 29 2024 10:46 AM

Actress Divya Pillai Comments On Romantic Scenes

సినిమాల్లో శృంగార సన్నివేశాలు అనగానే.. హా ఏముంది ఈజీనే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెరపై చూసే దానికి తెరవెనక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాల్నే 'మంగళవారం' ఫేమ్ నటి దివ్య పిళ్లై బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అనే వాటి గురించి చాలా ఓపెన్‌గా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.

'రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ సెట్స్‌లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మైండ్‌లో వేరే ఆలోచన ఏం ఉండదు' 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

'అలానే ముద్దుని భలే ఎంజాయ్ చేయడం లాంటిది కూడా ఏం ఉండదు. దీనిబట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. అలానే రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సహ నటుడితో కలిసి ముందు డిస్కస్ కూడా చేసుకోవాలి. సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు' అని దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది.

దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం 'బజూకా' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. 

(ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement