సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన భామ | Shruti Haasan launches her own production house Isidro | Sakshi
Sakshi News home page

సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన భామ

Published Thu, Aug 6 2015 3:53 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన  భామ

సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన భామ

ముంబై:   మా డీఎన్ఎ లోనే సినిమా ఉందని ప్రకటించిన అగ్ర కథానాయిక, శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కేందుకు  ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మల్టీటాలెంటెడ్ ఆర్టిస్టుగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈ అమ్మడు ఇపుడు కొత్తగా మరో రంగంలోకి అడుగుపెట్టింది. సొంతంగా ఒక ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా అవతరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శృతి ఇపుడు తన జోరు మరింత పెంచింది.  తన సొంత నిర్మాణ సంస్థ ఇస్రిదోను   లాంచ్ చేసింది. ఈ ప్రొడక్షన్  హౌస్ ద్వారా షార్ట్ ఫిలిం, యానిమేషన్, డిజినల్,  మల్టీమీడియా రంగంలోకి అడుగుపెట్టింది. మా రక్తంలోనే సినిమా ఉందని  గర్వంగా చెప్పే ఈ జూనియర్ హాసన్ సినీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది.  ఎంటర్టైన్మెంట్  రంగానికి  మంచి భవిష్యత్తు ఉందంటూ ఆ రంగంలో దూసుకెళ్తోంది. తన సంస్థ  ద్వారా వివిధ భాషల్లో వచ్చే షార్ట్ ఫిలింలను ప్రోత్సహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలను శృతిహాసన్  ప్రతినిధి ధ్రువీకరిచారు. .

తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన నటించే అవకాశాలను ఎగరేసుకుపోతున్న శృతి  వరుస విజయాలతో తనకు ఎదురే లేదని నిరూపించుకుంటోంది. తన తండ్రి కమల్ హాసన్ కు సినీపరిశ్రమలో ఉన్న పేరు ప్రఖ్యాతులకు నిజమైన వారసురాలిగా నిలుస్తోంది.  కమల్ కూడా దర్శకత్వం, రచన, స్క్రీన్ ప్లే.. ఇలా రకరకాల రంగాల్లో ఉన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement