‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’అనే ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. తమకున్న క్రేజ్‌ను కాసులుగా మల్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని, నితిన్, సందీప్ కిషన్ లాంటి వాళ్లందరూ ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. తమ సినిమాల్లో వీటిని భాగస్వామ్యం చేసి లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం చేరబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఎన్‌హెచ్‌కే(నందమూరి హరికృష్ణ) ఆర్ట్స్ బ్యానర్ పేరిట సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన తదుపరి సినిమాల్లో ఎన్‌హెచ్‌కే నిర్మాణ సంస్థను భాగస్వామిని చేయాలని భావిస్తున్నాడట.
ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్‌హెచ్‌కేను స్లీపింగ్ పార్ట్‌నర్‌గా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడట ఎన్టీఆర్. ఇక తన తదుపరి అన్ని చిత్రాల్లో ఎన్‌హెచ్‌కే స్లీపింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నడని టాలీవుడ్ టాక్. ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తమిత్తుడైన ఒకరు చూసుకుంటారని సమాచారం. నటుడిగా గొప్ప విజయాలను అందుకున్న ఎన్టీఆర్.. నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.
చదవండి:
జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం..
2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క
Comments
Please login to add a commentAdd a comment