నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు | Hero nara Rohith Revealed About his production Plans | Sakshi
Sakshi News home page

నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు

Published Thu, Dec 29 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు

నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ అరడజను సినిమాలను లైన్లో రెడీగా ఉంచుతున్నాడు రోహిత్. అంతేకాదు ఒకే ఏడాదిలో నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ పాతతరం నటులను గుర్తుకు తెస్తున్నాడు. ఇన్నాళ్లు హీరోగానే జోరు చూపించిన ఈ యంగ్ హీరో ఇక మీదట నిర్మాణ రంగంలోనూ అదే స్పీడు చూపించాలని భావిస్తున్నాడు.

ఈ ఏడాది చివర్లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమాను తన స్నేహితులు కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి తానే స్వయంగా నిర్మించాడు. ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ నిర్మాతగా కొనసాగే ఆలోచనలో ఉన్నాడు ఈ యువ హీరో. కొత్త సంవత్సరంలో తమ అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ మీద మూడు సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాను హీరోగా చేసే సినిమాలనే కాదు ఇతర హీరోల సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement