Appatlo Okadundevadu
-
సైలెంట్‌గా స్టార్ట్ చేసిన మెగా హీరో
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే వైష్ణవ్ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తొలి చిత్ర షూటింగ్ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ ప్రారంభించేశారట. నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాను డైరెక్ట్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ఒక్క సినిమా.. మూడు కథలు
‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో ప్రేక్షకు ల దృష్టిని ఆకర్షించిన యువ హీరో శ్రీవిష్ణు తాజాగా ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇంద్ర సేనని దర్శకునిగా పరిచయం చేస్తూ ఏంవీకే రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు ఓ స్టార్ హీరో, హీరోయిన్ నటించనున్నారు. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఇంద్రసేన మాట్లాడుతూ – ‘‘ఇందులో సమాంతరంగా సాగే మూడు కథలు ఉంటాయి. ఆయా కథల్లో ఉండే మూడు మిస్టరీ లను పరిష్కరిస్తూ సాగే థ్రిల్లర్ మూవీ. కథలు, కథనాలు హాలీవుడ్ సై్టల్లో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, సంగీతం: సతీశ్ రఘునాధన్. -
చిన్న సినిమాలే ఊపిరి
‘‘రెండేళ్ల కిందట మన సినిమాలు చూస్తే చాలా బాధేసింది. ఇతర భాషల సినిమా వాళ్లు కొత్త క్రియేటివిటీతో ముందుకెళుతుంటే మనం ఎక్క డున్నాం? అని మూడేళ్లుగా నాకు అనిపించింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూశాను. నచ్చింది. నారా రోహిత్ ఇతర హీరోలకు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. శ్రీవిష్ణు నటన బాగుంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో సాగర్.కె చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్‌మీట్‌లో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలంటే కమర్షియల్. వాటి గురించి మాట్లాడటం అనవసరం. ఎప్పుడూ చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ఊపిరి. సినిమా రివ్యూలు, రేటింగుల మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకుని బాధ్యతతో రాయాలి. ఓవర్సీస్లో వీటి ప్రభావం ఉంటుంది. నిజాయతీ రివ్యూలు ఇచ్చేందుకు ‘గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్’ అని ఆరుగురితో టీమ్‌ను ఏడాదిలోపే ఏర్పాటు చేయా లనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘కథపై మేం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. మరో 100 థియేటర్లను పెంచుతున్నాం’’ అని నారా రోహిత్ అన్నారు. దర్శక, నిర్మాతలు, శ్రీవిష్ణు, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆ సినిమా కోసం తగ్గుతున్నా!
‘‘నారా రోహిత్ బాగా చేశాడనే ప్రశంసల కన్నా సినిమా బాగుందంటే చాలు. ఎక్కువ సంతోషపడతా. కథ నచ్చితే నా పాత్ర నిడివి గురించి ఆలోచించను’’ అన్నారు నారా రోహిత్. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా ప్రశాంతి, కృష్ణవిజయ్ నిర్మించిన సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. గత ఏడాది డిసెంబర్ 31న విడుదలైన ఈ సినిమా గురించి రోహిత్ చెప్పిన సంగతులు... ► మూడేళ్లు ఈ కథపై వర్క్ చేశాం. ఈ సినిమాలోని ఇంతి యాజ్ అలీ తరహా పాత్ర మళ్లీ రావడం కష్టమే. అందుకే లెంగ్త్ తక్కువైనా ఆ పాత్ర చేశా. నాకు హీరోయిన్ పెట్టాలా? వద్దా? అని ఆలోచించి 3 నెలలు షూటింగ్ పక్కన పెట్టాం. కథ ప్రకారం హీరోయిన్ లేకపోతేనే బాగుంది. అలాగే, మొదటి నుంచి రైల్వేరాజుగా శ్రీవిష్ణు సెట్ అవుతాడనుకున్నా. మా క్యారెక్టర్లకి మంచి పేరుతో పాటు సినిమా హిట్ కావడం హ్యాపీ. ఈ సినిమాతో నిర్మాతగా మారడంతో ఈ హిట్ మరింత హ్యాపీనిచ్చింది. ► గత ఏడాది నా తప్పులేంటో నేను తెలుసుకున్నా. ముఖ్యంగా ఓ సినిమా రిలీజైన తర్వాతే తదుపరి సినిమా లుక్, టైటిల్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఒకేసారి ఎక్కువ సినిమాలు ప్రకటించి లుక్స్ రిలీజ్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతోంది. మళ్లీ అటువంటి తప్పు చేయను. ప్రస్తుతం చేస్తున్న ‘కథలో రాజకుమారి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా. ► ఫిబ్రవరిలో పవన్ మల్లాలని దర్శకునిగా పరిచయం చేస్తూ నటించబోయే కమర్షియల్ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం సన్నబడాలని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నా. శ్రీవిష్ణు హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా నిర్మిస్తున్నా. -
చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!
మీడియం బడ్జెట్‌తో చిన్న సినిమాగా తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు'.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాసిటివ్ మౌత్‌టాక్ రావడం, మంచి రివ్యూలు వెలువడటంతో పరిమితమైన థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు రూ. 20 కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశముందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వచ్చేవారం ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బిగ్ సినిమాలు వస్తుండటంతో కలెక్షన్లు తగ్గవచ్చునని భావిస్తున్నారు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర తన రెండో సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు' మంచి ఆదరణ పొందుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీ విష్ణు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
దేవీ థియేటర్లో అప్పట్లో ఒకడుండేవాడు టీం
-
'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ
టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు జానర్ : పీరియాడిక్ యాక్షన్ డ్రామా తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను, సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : సాగర్ కె చంద్ర నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్ కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే యంగ్ హీరో నారా రోహిత్, తానే సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సినిమా తనకు రీలాంచ్ లాంటిదంటూ ప్రకటించిన రోహిత్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తన గత చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు మరో హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు నారా రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిందా..? కథ : 1990లలో జరిగే కథ అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు (శ్రీ విష్ణు)... అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైన రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటాడు. అదే కాలనీలో ఉండే నిత్యా (తాన్యా హోపె)తో ప్రేమలో ఉంటాడు. ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తను నమ్మిన ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకాడని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. రైల్వే రాజు అక్క, అహల్య కాలేజీ రోజుల్లో సవ్యసాఛి అనే నక్సలైట్‌ను ప్రేమించి దళంలోకి వెళ్లిపోతుంది. దళంలో యాక్టివ్‌గా పనిచేసే అహల్య వివరాలు తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ, రైల్వే రాజును పిలిపించి ఇంటరాగేట్ చేస్తాడు. తన అక్క ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. రాజుకు రంజీ టీంలో క్రికెట్ ఆడే అవకాశం దక్కకుండా చేస్తాడు. అదే సమయంలో తను ప్రేమించిన నిత్యాను ఎత్తుకెళ్లిన భగవాన్ దాస్ అనే రౌడీతో గొడవపడిన రాజు ఆ రౌడీని చంపి, అరెస్ట్ అవుతాడు. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజు జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. దళంలో పనిచేసే అక్క చనిపోతుంది. ఆ విషయం తెలిసి రాజు తల్లి కూడా చనిపోతుంది. ఇలా తనకు ఇష్టమైనవన్ని ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో వీటన్నింటికీ కారణమైన ఇంతియాజ్ అలీ మీద కోపం పెంచుకుంటాడు రాజు. అదే సమయంలో ఓ ఇండస్ట్రియలిస్ట్ తన అవసరాల కోసం రాజుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువస్తాడు. తన ఆస్తులకు రాజును బినామీగా మారుస్తాడు. ఆ ఇండస్ట్రీయిలిస్ట్ అండతో రాజు ఎన్నో చీకటి వ్యాపారాలు, దందాలు మొదలుపెడతాడు. ప్రేమించిన నిత్యాను పెళ్లి చేసుకుంటాడు. తన జీవితం కష్టాలపాలవ్వడానికి కారణమైన ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేయించి, ఇక జీవితంలో నీ ఒంటి మీదకు పోలీస్ డ్రెస్ రానివ్వనని ఛాలెంజ్ చేస్తాడు. ఒక్కొక్కటిగా రాజు ఆగడాలు ఎక్కువవుతాయి. తనకు అడ్డొచ్చిన వారిని చంపటం బెదిరించటంతో పాటు రియల్ ఎస్టేట్, హవాలా లాంటి వ్యాపారాలతో చాలా డబ్బు సంపాదిస్తాడు. అంతే కాదు దేశాన్నే కుదిపేసే స్టాంప్ పేపర్ల స్కాంలోనూ భాగస్వామి అవుతాడు. దీంతో రాజు ఆటకట్టించడానికి ఇంతియాజ్ అలీనే కరెక్ట్ అని భావించిన పోలీస్ డిపార్టెమెంట్, రాజును వేటాడటానికి ఇంతియాజ్‌కు పోస్టింగ్ ఇస్తుంది. తిరిగి డ్యూటిలో జాయిన్ అయిన ఇంతియాజ్, రాజు అనుచరలను, వ్యాపారాలను, అన్నింటిని నాశనం చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరిదిపై చేయి అయ్యింది. తప్పుడుదారిలో వెళ్లిన రాజు చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మొదట నుంచి ఇది నారా రోహిత్ సినిమాగా ప్రచారం జరిగినా.. కథ అంతా శ్రీవిష్ణు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రోహిత్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్, బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక శ్రీ విష్ణు తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. లక్ష్యం కోసం ప్రయత్నించే అమాయకుడైన కుర్రాడిగా, సమాజం మీద ఎదురుతిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌లో శ్రీ విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్గా నటించిన తాన్యా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇతర పాత్రలో బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీనులు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాతో నిర్మాతగానూ మారిన హీరో నారా రోహిత్ తన మార్క్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర, అప్పట్లో ఒకడుండేవాడుతో ఆకట్టుకున్నాడు. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న దర్శకుడు, ఆకట్టుకునే కథనంతో సినిమాను నడిపించాడు. పెద్దగా పాటలు అవసరం లేని కథలో సాయి కార్తీక్ అందించిన పాటలు స్పీడు బ్రేకర్లలా అనిపించాయి. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్, శ్రీ విష్ణు నటన నేపథ్య సంగీతం కథా కథనం మైనస్ పాయింట్స్ : పాటలు తొలి 15 నిమిషాలు స్లో నారేషన్ ఓవరాల్‌గా అప్పట్లో ఒకడుండేవాడు.. 2016కు వీడ్కోలు చెప్పే సక్సెస్ఫుల్ యాక్షన్ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నిర్మాతగానూ స్పీడు పెంచుతున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎప్పుడూ అరడజను సినిమాలను లైన్లో రెడీగా ఉంచుతున్నాడు రోహిత్. అంతేకాదు ఒకే ఏడాదిలో నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ పాతతరం నటులను గుర్తుకు తెస్తున్నాడు. ఇన్నాళ్లు హీరోగానే జోరు చూపించిన ఈ యంగ్ హీరో ఇక మీదట నిర్మాణ రంగంలోనూ అదే స్పీడు చూపించాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నారా రోహిత్. ఈ సినిమాను తన స్నేహితులు కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి తానే స్వయంగా నిర్మించాడు. ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ నిర్మాతగా కొనసాగే ఆలోచనలో ఉన్నాడు ఈ యువ హీరో. కొత్త సంవత్సరంలో తమ అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ మీద మూడు సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాను హీరోగా చేసే సినిమాలనే కాదు ఇతర హీరోల సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. -
డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా
‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అని సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది అంటుంటారు. అయితే శ్రీవిష్ణు దీన్నే మరోలా అంటున్నారు. ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ నని! నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య తారలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి పదకొండేళ్లవుతోంది. నాకున్న మొహమాటానికి యాక్టర్ అవుతానని ఊహించలేదు. కానీ, అయ్యాను. 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశాన్నే వణికించిన ఐదారు అంశాలు ఇందులో ఉంటాయి. ఒక క్రికెటర్, ఓ పోలీసాఫీసర్ మధ్య జరిగిన కథే ఈ చిత్రం. ఇందులో క్రికెటర్ రైల్వే రాజు పాత్రలో నటించాను. ఉద్యోగం కోసం ఏదైనా చేయడానికి వెనకాడని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను నారా రోహిత్ చేసారు. ఈ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘నీది నాది ఒకే ప్రేమకథ’ అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నా. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్న ‘మెంటల్ మదిలో’ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది’’ అన్నారు. -
పోటాపోటీగా...
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీవిష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, ఈనెల 30న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకూ రాని వైవిధ్యభరితమైన కథా చిత్రమిది. ‘ప్రతినిధి’ చిత్రం తర్వాత రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించారు. ఒకరు పోలీసాఫీసర్‌గా, మరొకరు క్రికెటర్‌గా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నారా రోహిత్ సహకారంతోనే ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. సాయికార్తీక్ పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్, సమర్పణ: నారా రోహిత్. -
సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒకడుండేవాడు`
బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో అలరిస్తున్నాడు. ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా నారా రోహిత్ నటించిన మరో విలక్షణ చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా నారారోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. -
ఈ సారైనా లుక్ మారుస్తాడా..!
కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. స్టార్ ఇమేజ్ కోసం పోటి పడకుండా, డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తొలి నాళ్లలో బాగానే ఉన్నా తరువాత మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు. మరీ బొద్దుగా తయారైన రోహిత్, చాలా రోజులుగా లుక్ మారుస్తానని చెపుతున్నా ప్రతీ సినిమాలో లావుగానే దర్శనమిస్తున్నాడు. ఈ మధ్యే ఫిజిక్ మీద దృష్టి పెట్టిన రోహిత్ త్వరలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నారా రోహిత్ జిమ్‌లో చెమటోడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన అప్పట్లో ఒకడుండేవాడుతో పాటు, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కథలో రాజకుమారి సినిమాల్లో కూడా రోహిత్ కాస్త లావుగానే కనిపించే అవకాశం ఉంది. ఆ తరువాత తెరకెక్కబోయే సినిమా కోసమే రోహిత్ న్యూలుక్ ట్రై చేస్తున్నాడట. -
పాతికేళ్ల క్రితం కథతో...
‘‘ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో మా చిత్రం సాగుతుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కొంత నక్సలిజాన్ని కూడా టచ్ చేశాం. ప్రేమ, వినోదం, యాక్షన్ అన్నీ ఉంటాయి. నారా రోహిత్ సపోర్ట్‌తోనే సినిమాని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తా. కొత్త తరహా కథతో తెరకెక్కిన చిత్రమిది. నా కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సాయికార్తీక్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి’’ అన్నారు. ‘‘ఈ తరహా చిత్రంలో నేను నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రం విజయం సాధిస్తే మరికొన్ని కొత్త చిత్రాలు వస్తాయి’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. శ్రీవిష్ణు, తాన్యా హోప్, నటులు సత్య, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్. -
అప్పట్లో ఒకడుండేవాడు టీజర్ వచ్చేసింది
-
అదే గెటప్‌లో.. నాలుగోసారి..!
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఆసక్తికర కథలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే బాటలో నడుస్తున్న రోహిత్.. ఎక్కువగా సీరియస్ పాత్రల్లోనే కనిపించాడు. అది కూడా ఎక్కువగా పోలీస్ గెటప్‌లోనే. ఇప్పటికే మూడు సినిమాల్లో పోలీస్ డ్రస్ వేసుకున్న రోహిత్ ఇప్పుడు మరోసారి అదే గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. తొలి సినిమా బాణంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన నారా రోహిత్ తరువాత రౌడీఫెలో, అసుర సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. గతంలో రోహిత్ పోలీస్‌గా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించగా మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు'
నారా రోహిత్ తాజా చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. గత సినిమాలు నిరాశ పరచడంతో నారా వారబ్బాయి ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో రోహిత్ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారట. 'అయ్యారే' ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ సరసన తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.