చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు! | Appatlo Okadundevadu collections | Sakshi
Sakshi News home page

చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!

Published Tue, Jan 3 2017 8:40 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!

చిన్న తెలుగు సినిమాకు పెద్ద వసూళ్లు!

మీడియం బడ్జెట్‌తో చిన్న సినిమాగా తెరకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు'.. సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్‌, శ్రీ విష్ణు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పాసిటివ్‌ మౌత్‌టాక్‌ రావడం, మంచి రివ్యూలు వెలువడటంతో పరిమితమైన థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాకు రూ. 20 కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశముందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నప్పటికీ వచ్చేవారం ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి బిగ్‌ సినిమాలు వస్తుండటంతో కలెక్షన్లు తగ్గవచ్చునని భావిస్తున్నారు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర తన రెండో సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు' మంచి ఆదరణ పొందుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్‌, శ్రీ విష్ణు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement