ఆ సినిమా కోసం తగ్గుతున్నా! | Nara rohit about Appatlo Okadundevadu movie | Sakshi
Sakshi News home page

ఆ సినిమా కోసం తగ్గుతున్నా!

Published Wed, Jan 4 2017 11:48 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

ఆ సినిమా కోసం తగ్గుతున్నా! - Sakshi

ఆ సినిమా కోసం తగ్గుతున్నా!

‘‘నారా రోహిత్‌ బాగా చేశాడనే ప్రశంసల కన్నా సినిమా బాగుందంటే చాలు. ఎక్కువ సంతోషపడతా. కథ నచ్చితే నా పాత్ర నిడివి గురించి ఆలోచించను’’ అన్నారు నారా రోహిత్‌. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా ప్రశాంతి, కృష్ణవిజయ్‌ నిర్మించిన సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. గత ఏడాది డిసెంబర్‌ 31న విడుదలైన ఈ సినిమా గురించి రోహిత్‌ చెప్పిన సంగతులు...

► మూడేళ్లు ఈ కథపై వర్క్‌ చేశాం. ఈ సినిమాలోని ఇంతి యాజ్‌ అలీ తరహా పాత్ర మళ్లీ రావడం కష్టమే. అందుకే లెంగ్త్‌ తక్కువైనా ఆ పాత్ర చేశా. నాకు హీరోయిన్‌ పెట్టాలా? వద్దా? అని ఆలోచించి 3 నెలలు షూటింగ్‌ పక్కన పెట్టాం. కథ ప్రకారం హీరోయిన్‌ లేకపోతేనే బాగుంది. అలాగే, మొదటి నుంచి రైల్వేరాజుగా శ్రీవిష్ణు సెట్‌ అవుతాడనుకున్నా. మా క్యారెక్టర్లకి మంచి పేరుతో పాటు సినిమా హిట్‌ కావడం హ్యాపీ. ఈ సినిమాతో నిర్మాతగా మారడంతో ఈ హిట్‌ మరింత హ్యాపీనిచ్చింది.

► గత ఏడాది నా తప్పులేంటో నేను తెలుసుకున్నా. ముఖ్యంగా ఓ సినిమా రిలీజైన తర్వాతే తదుపరి సినిమా లుక్, టైటిల్‌ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. ఒకేసారి ఎక్కువ సినిమాలు ప్రకటించి లుక్స్‌ రిలీజ్‌ చేయడం వల్ల కన్ఫ్యూజన్‌ పెరుగుతోంది. మళ్లీ అటువంటి తప్పు చేయను. ప్రస్తుతం చేస్తున్న ‘కథలో రాజకుమారి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా.

► ఫిబ్రవరిలో పవన్‌ మల్లాలని దర్శకునిగా పరిచయం చేస్తూ నటించబోయే కమర్షియల్‌ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా కోసం సన్నబడాలని జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్నా. శ్రీవిష్ణు హీరోగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా నిర్మిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement