ఒక్క సినిమా.. మూడు కథలు | Sri vishnu in a multi-starrer | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమా.. మూడు కథలు

Published Sun, Jan 22 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

ఒక్క సినిమా.. మూడు కథలు

ఒక్క సినిమా.. మూడు కథలు

‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో ప్రేక్షకు ల దృష్టిని ఆకర్షించిన యువ హీరో శ్రీవిష్ణు తాజాగా ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇంద్ర సేనని దర్శకునిగా పరిచయం చేస్తూ ఏంవీకే రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు ఓ స్టార్‌ హీరో, హీరోయిన్‌ నటించనున్నారు.

ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఇంద్రసేన మాట్లాడుతూ – ‘‘ఇందులో సమాంతరంగా సాగే మూడు కథలు ఉంటాయి. ఆయా కథల్లో ఉండే మూడు మిస్టరీ లను పరిష్కరిస్తూ సాగే థ్రిల్లర్‌ మూవీ. కథలు, కథనాలు హాలీవుడ్‌ సై్టల్‌లో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ నాయర్, సంగీతం: సతీశ్‌ రఘునాధన్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement