సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు` | appatlo okadundevadu Gets U/A Certificate from Censor Board | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

Published Wed, Dec 14 2016 2:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

సెన్సార్ పూర్తి చేసుకున్న `అప్పట్లో ఒక‌డుండేవాడు`

బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలరిస్తున్నాడు.  ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, జ్యో అచ్యుతానంద లాంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా నారా రోహిత్ న‌టించిన మ‌రో విల‌క్షణ చిత్రం `అప్పట్లో ఒక‌డుండేవాడు`. నారా రోహిత్‌, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా  నారారోహిత్ స‌మ‌ర్పణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

నారా రోహిత్ ముస్లిం పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్గా కనిపించనున్నాడు. ఒకే సమయంలో 90వ దశకం కథతో పాటు ప్రస్తుత కథ కూడా నడిచేలా డిఫరెంట్ స్క్రీన్ప్లేతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యు/ఎ సర్టిఫికేట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement