వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు' | Appatlo Okadundevadu ready for release | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు'

Published Tue, Aug 16 2016 5:54 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు' - Sakshi

వచ్చే నెలలో 'అప్పట్లో ఒకడుండేవాడు'

నారా రోహిత్ తాజా చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సెప్టెంబరు నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. గత సినిమాలు నిరాశ పరచడంతో నారా వారబ్బాయి  ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో జరిగే ఈ కథలో రోహిత్ ముస్లిం యువకుడిగా కనిపించనున్నారట. 'అయ్యారే' ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ సరసన తానియా హోప్ కథానాయికగా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement