
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే వైష్ణవ్ ఎంట్రీకి సంబంధించిన పనులు మొదలైనట్టుగా వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తొలి చిత్ర షూటింగ్ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ ప్రారంభించేశారట. నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను తెరకెక్కించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాను డైరెక్ట్‌చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment