పోటాపోటీగా... | Appatlo Okadundevadu movie | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా...

Published Thu, Dec 15 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

పోటాపోటీగా...

పోటాపోటీగా...

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్‌. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీవిష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని,  ఈనెల 30న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకూ రాని వైవిధ్యభరితమైన కథా చిత్రమిది. ‘ప్రతినిధి’ చిత్రం తర్వాత రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించారు. ఒకరు పోలీసాఫీసర్‌గా, మరొకరు క్రికెటర్‌గా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నారా రోహిత్‌ సహకారంతోనే ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. సాయికార్తీక్‌ పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్‌ యాదవ్, సమర్పణ: నారా రోహిత్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement