ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, అతని భార్య అనుష్క శర్మ గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ కోహ్లీకి స్వయానా బావ, అనుష్క శర్మ అన్న 'కర్నేష్ శర్మ' (Karnesh Sharma) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతడు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కూడా. రూ. కోట్లలో సంపాదిస్తున్న కర్నేష్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
క్లీన్ స్లేట్ ఫిలింజ్..
బాలీవుడ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన కర్నేష్ శర్మ తన చెల్లెలు అనుష్క శర్మతో కలిసి 2013లో క్లీన్ స్లేట్ ఫిలింజ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ కొట్టి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. ఫిలౌరీ, NH10 సహా పలు హిట్ చిత్రాలను కూడా ఇందులోనే నిర్మించారు.
నిజానికి కర్నేష్ శర్మ విజయ ప్రస్థానం అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్10తో ప్రారంభమైంది. రూ.30 కోట్ల బడ్జెట్‌లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా రాణించలేదు, కానీ ఆ తరువాత మంచి యాక్షన్ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఫిలౌరీ, పారి, బుల్బుల్ వంటివి కూడా మంచి హిట్స్ అందించాయి.
(ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!)
కర్నేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఖాలా (Qala) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈయన తరువాత చిత్రం 'చక్‌దే ఎక్స్‌ప్రెస్'. ఇది ఇండియన్ క్రికెటర్ 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా తెరకెక్కనుంది.
(ఇదీ చదవండి: ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!)
నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం..
కర్నేష్ శర్మ అండ్ అనుష్క శర్మల నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 400 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. దీని కింద ఎనిమిది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. చివరగా కర్నేష్ శర్మ నికర విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment