Karnesh Sharma
-
విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?
గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడ చూసినా 'యానిమల్' గురించే డిస్కషన్. ఈ సినిమాలోని బిట్ సాంగ్స్, ఫైట్స్.. ఇలా అన్నింటి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలానే రెండో హీరోయిన్గా చేసిన తృప్తి దిమ్రి గురించి కాసింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె సింగిల్ కాదని, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో ఉందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దిల్లీలో పుట్టిపెరిగిన తృప్తి.. 2017లో వచ్చిన శ్రీదేవి 'మామ్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈ మూవీస్‌తో హిందీలో మంచి పాపులారిటీ సంపాదించింది. 'యానిమల్' చిత్రంలో జోయ అనే పాత్రలో నటించడం ఈమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఎందుకంటే డిసెంబరు 1న సినిమా రిలీజైన దగ్గర నుంచి హీరో రణ్‌బీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. సెకండ్ హీరోయిన్గా నటించిన తృప్తి దిమ్రి గురించి అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. మూవీ విడుదలైనప్పుడు 6 లక్షల వరకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పుడు ఏకంగా 20 లక్షలు దాటేసింది. సరే సినిమా సంగతులన్నీ పక్కనబెడితే తృప్తి.. విరాట్ కోహ్లీ బావ, అదేనండి అనుష్క శర్మ అన్నతో ప్రేమలో ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తృప్తి నటించిన 'బుల్బుల్' సినిమాకు కర్నేశ్ శర్మ నిర్మాత. ఇతడు అనుష్క శర్మకి సొంత అన్నయ్య. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే తృప్తి-కర్నేశ్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. అయితే కొన్ని నెలల ముందు ఇద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు ఫొటోల్ని కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లే అని అంతా అనుకుంటున్నారు. 'యానిమల్' మూవీ పుణ్యాన.. ఈ లవ్వు, బ్రేకప్ టాపిక్ మరోసారి డిస్కషన్‌లోకి వచ్చింది అంతే! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
కోహ్లి బావ గురించి తెలుసా? వందల కోట్లు పెట్టి..
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, అతని భార్య అనుష్క శర్మ గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ కోహ్లీకి స్వయానా బావ, అనుష్క శర్మ అన్న 'కర్నేష్ శర్మ' (Karnesh Sharma) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతడు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కూడా. రూ. కోట్లలో సంపాదిస్తున్న కర్నేష్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లీన్ స్లేట్ ఫిలింజ్.. బాలీవుడ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన కర్నేష్ శర్మ తన చెల్లెలు అనుష్క శర్మతో కలిసి 2013లో క్లీన్ స్లేట్ ఫిలింజ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ కొట్టి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. ఫిలౌరీ, NH10 సహా పలు హిట్ చిత్రాలను కూడా ఇందులోనే నిర్మించారు. నిజానికి కర్నేష్ శర్మ విజయ ప్రస్థానం అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్10తో ప్రారంభమైంది. రూ.30 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా రాణించలేదు, కానీ ఆ తరువాత మంచి యాక్షన్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఫిలౌరీ, పారి, బుల్బుల్ వంటివి కూడా మంచి హిట్స్ అందించాయి. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) కర్నేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఖాలా (Qala) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈయన తరువాత చిత్రం 'చక్‌దే ఎక్స్‌ప్రెస్'. ఇది ఇండియన్ క్రికెటర్ 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. (ఇదీ చదవండి: ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!) నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం.. కర్నేష్ శర్మ అండ్ అనుష్క శర్మల నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 400 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. దీని కింద ఎనిమిది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. చివరగా కర్నేష్ శర్మ నికర విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. -
వన్.. టు.. త్రీ..
...మూవీస్‌ను ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట అనుష్కా శర్మ. ఆల్రెడీ హిందీ చిత్రాలు ‘సూయిధాగా, జీరో’ల్లో కథానాయికగా నటిస్తున్నారామె. సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’లోనూ స్క్రీన్‌పై మెరవనున్నారు. సో.. ఈ ఏడాది అరడజనుకు పైగా వెండితెరపై అనుష్కా శర్మను చూడొచ్చని సంబరపడిపోకండి. ఇక్కడే ఉంది అసలు మెలిక. త్వరలో అనుష్కా శర్మ ఎనౌన్స్ చేయబోయే మూడు సినిమాలు కథానాయికగా కాదు. నిర్మాతగా. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు అనుష్కా శర్మ. తొలి ప్రయత్నంగా ‘ఎన్‌హెచ్ 10’ నిర్మించారు. ఆ తర్వాత ఫిల్హౌరీ, పరీ సినిమాల నిర్మాణంలో భాగమైంది క్లీన్ స్లేట్ ఫిలిమ్స్. ఇప్పుడు సోలో నిర్మాతగా సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట. మంచి స్క్రిప్ట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నారట అనుష్కా శర్మ. అదండీ మేటర్. -
సినిమా షూటింగ్ లో అపశ్రుతి
ముంబయి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘పారి’. ఈ మూవీని అనుష్క తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ లో అపశృతి చోటుచేసుకుంది. మంగళవారం కరెంట్ షాక్ తో టెక్నీషియన్ ఎస్‌హెచ్ శాహబే అలాం మృతిచెందడంతో మూవీ యూనిట్ సంతాపం ప్రకటించారు. అతడు లైటింగ్ డిపార్ట్ మెంట్ లో భాగంగా పనిచేస్తున్నారు. ‘ప్రోసిట్ రాయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ మంగళవారం జరగుతుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కరెంట్ షాక్ వల్ల లైటింగ్ డిపార్ట్మెంట్కు చెందిన మా సిబ్బంది శాహబేను కోల్పోయాం. వెంటనే చికిత్స అందించినా సహచరుడిని కాపాడుకోలేకపోయాం. కష్ట కాలంలో మూవీ యూనిట్, మేము బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని’ క్లీన్ స్టేట్ ఫిల్మ్స్ కో ఓనర్ కర్ణేశ్ శర్మ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.