
...మూవీస్‌ను ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట అనుష్కా శర్మ. ఆల్రెడీ హిందీ చిత్రాలు ‘సూయిధాగా, జీరో’ల్లో కథానాయికగా నటిస్తున్నారామె. సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’లోనూ స్క్రీన్‌పై మెరవనున్నారు. సో.. ఈ ఏడాది అరడజనుకు పైగా వెండితెరపై అనుష్కా శర్మను చూడొచ్చని సంబరపడిపోకండి. ఇక్కడే ఉంది అసలు మెలిక.
త్వరలో అనుష్కా శర్మ ఎనౌన్స్ చేయబోయే మూడు సినిమాలు కథానాయికగా కాదు. నిర్మాతగా. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు అనుష్కా శర్మ. తొలి ప్రయత్నంగా ‘ఎన్‌హెచ్ 10’ నిర్మించారు. ఆ తర్వాత ఫిల్హౌరీ, పరీ సినిమాల నిర్మాణంలో భాగమైంది క్లీన్ స్లేట్ ఫిలిమ్స్. ఇప్పుడు సోలో నిర్మాతగా సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట. మంచి స్క్రిప్ట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నారట అనుష్కా శర్మ. అదండీ మేటర్.
Comments
Please login to add a commentAdd a comment