విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్? | Animal Movie Tripti Dimri Boyfriend Karnesh Sharma Details | Sakshi
Sakshi News home page

Tripti Dimri Boyfriend: 'యానిమల్' నటి తృప్తి దిమ్రీ లవ్‌స్టోరీ తెలుసా?

Published Wed, Dec 6 2023 5:58 PM | Last Updated on Wed, Dec 6 2023 6:27 PM

Animal Movie Tripti Dimri Boyfriend Karnesh Sharma Details - Sakshi

గత నాలుగైదు రోజుల నుంచి ఎక్కడ చూసినా 'యానిమల్' గురించే డిస్కషన్. ఈ సినిమాలోని బిట్ సాంగ్స్, ఫైట్స్.. ఇలా అన‍్నింటి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలానే రెండో హీరోయిన్‌గా చేసిన తృప్తి దిమ్రి గురించి కాసింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె సింగిల్ కాదని, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ బావతో ప్రేమలో ఉందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

దిల్లీలో పుట్టిపెరిగిన తృప్తి.. 2017లో వచ్చిన శ్రీదేవి 'మామ్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్‌బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈ మూవీస్‌తో హిందీలో మంచి పాపులారిటీ సంపాదించింది. 'యానిమల్' చిత్రంలో జోయ అనే పాత్రలో నటించడం ఈమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా)

ఎందుకంటే డిసెంబరు 1న సినిమా రిలీజైన దగ్గర నుంచి హీరో రణ్‌బీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి దిమ్రి గురించి అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. మూవీ విడుదలైనప్పుడు 6 లక్షల వరకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పుడు ఏకంగా 20 లక్షలు దాటేసింది.

సరే సినిమా సంగతులన్నీ పక్కనబెడితే తృప్తి.. విరాట్ కోహ్లీ బావ, అదేనండి అనుష్క శర్మ అన్నతో ప్రేమలో ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తృప్తి నటించిన 'బుల్‌బుల్' సినిమాకు కర్నేశ్ శర్మ నిర్మాత. ఇతడు అనుష్క శర్మకి సొంత అన్నయ్య. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే తృప్తి-కర్నేశ్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు. అయితే కొన్ని నెలల ముందు ఇద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు ఫొటోల్ని కూడా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లే అని అంతా అనుకుంటున్నారు. 'యానిమల్' మూవీ పుణ్యాన.. ఈ లవ్వు, బ్రేకప్ టాపిక్ మరోసారి డిస్కషన్‌లోకి వచ్చింది అంతే!

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement