
'యానిమల్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి తృప్తి దిమ్రి. అంతకు ముందు పలు హిందీ చిత్రాల్లో నటించింది. కానీ ఈ మూవీతో స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో కాస్త బిజీ అయిపోయింది. అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ ఈవెంట్‌కి హాజరవుతానని చెప్పి లక్షల తీసుకుని మోసం చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)
ఇంతకీ ఏమైంది?
జైపుర్‌కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ఇది జరిగింది. అయితే దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి రూ.5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలవడానికి ఐదు నిమిషాల ముందు వరకు వచ్చేస్తానని చెప్పిందట. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళ వ్యాపారవేత్తలు తృప్తిపై నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఫొటోపై నల్లని పెయింట్ రాశారు.
ఇక ఈ ఘటనపై స్పందించిన నిర్వహకురాలు.. తృప్తి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిందని, ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. జైపుర్‌లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని, ఆమె తమని మోసం చేసిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో తృప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)
Tripti Dimri skips event after pocketing ₹5 lakhs; women’s group protests by blackening her poster pic.twitter.com/Ih2bLKzWcG
— WarpaintJournal.in (@WarpaintJ) October 1, 2024