యానిమల్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించింది తృప్తి డిమ్రి. ఈ పాత్రతో బోలెడంత క్రేజ్ సంపాదించింది. సినిమాలో క్లిష్టమైన సన్నివేశాల్లోనూ ఏమాత్రం బెరుకు లేకుండా నటించింది. ఈమె అందం, అభినయం చూసిన కుర్రకారు త్రిప్తిని తమ ఫేవరెట్ క్రష్ జాబితాలో చేర్చుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ యానిమల్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
బెడ్‌రూమ్ సీన్.. దానితో పోలిస్తే ఇదెంత?
'నేను నటించిన జోయా పాత్రకు ఇంత ఆదరణ వస్తుందనుకోలేదు. అయితే చాలామంది హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించిన బెడ్‌రూమ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఈ సీన్ కంటే కూడా బుల్‌బుల్ సినిమాలోని అత్యాచార సన్నివేశం చాలా కష్టమైనది. ఇది నేను నటిగా కాకుండా ఒక అమ్మాయిగా చెప్తున్నాను. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అంతా ఇచ్చేయడం అనేది చాలా కష్టం. దానితో పోలిస్తే యానిమల్‌లో నేను చేసింది పెద్ద విషయమే కాదు. ఒక నటిగా నా పాత్రకు నేను న్యాయం చేయాలి. అలాంటప్పుడు దుస్తులు లేకుండా ఆ సీన్‌లో నటించడం తప్పేమీ కాదు.
ఆ రోజు సెట్‌లో నలుగురే..
ఆ రోజు ఆ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు సెట్‌లో నలుగురే ఉన్నారు. నేను, రణ్‌బీర్, సందీప్ రెడ్డి, కెమెరామన్ మాత్రమే ఉన్నాం. ఇంకెవరూ లేరు. ప్రతి ఐదు నిమిషాలకు వారు నా గురించి అడుగుతూనే ఉన్నారు. నువ్వు ఓకేనా? కంఫర్ట్‌గానే ఉన్నావా? ఏదైనా ఇబ్బందా? అని తరచూ ఆరా తీశారు. చాలా సపోర్ట్ చేశారు. కానీ రణ్‌బీర్‌తో నటించే సీన్ కావడంతో కొంత కంగారుపడ్డాను. అది అర్థం చేసుకున్న అతడు.. చాలా బాగా మాట్లాడి నేను ఫ్రీ అయ్యేలా చేశాడు. ముందు ఎవరి సీన్ కావాలంటే వారిది చేద్దాం అని స్వీట్‌గా మాట్లాడుతూ నా కంగారు పోగొట్టాడు' అని చెప్పుకొచ్చింది తృప్తి డిమ్రి.
చదవండి: షాకింగ్ న్యూస్.. అస్సలు నమ్మలేకపోతున్నాను.. ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు.. సిమ్రాన్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment