
పృథ్వీరాజ్ సుకుమారన్
ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాతృభాషలో మాత్రమే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగా కూడా మలయాళంలో పేరుంది. ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారాయన. సినీ నిర్మాతగా మారారు. ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్’ను స్టార్ట్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ‘‘మా కొత్త కలను నిజం చేసుకోవడానికి నేను, నా భార్య సుప్రియ ఏడాది నుంచి కష్టపడుతున్నాం. పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశామని చెప్పడానికి ఆనందపడుతున్నాను.
ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి సంవత్సరం టైమ్ ఎందుకు పట్టింది? సమ్‌థింగ్ స్పెషల్‌గా ఏం చేయబోతున్నాం? అనే మరికొన్ని ప్రశ్నలకు త్వరలోనే మేము అనౌన్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ ద్వారా సమాధానాలు దొరుకుతాయి. నా వంతుగా మలయాళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. న్యూ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసే క్రమంలో వ్యాపారవేత్త షాజి నడేశన్, కెమెరామేన్ సంతోష్ శివన్ ఎంతో సహకరించారు. నేను నిర్మాతగా బుడి బుడి అడుగులు వేయాలనుకున్నప్పుడు నా వేలు పట్టుకుని, నేను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించేవరకూ ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. వారికే కాదు సినిమా అంటే ఏంటో నేను తెలుసుకునే ప్రయాణంలో నాకు తోడుగా ఉండి, సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు పృథ్వీరాజ్.
Comments
Please login to add a commentAdd a comment