death anniversiry
-
పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్.. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్‌తో పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి -
రియల్ స్టార్ శ్రీహరి నెరవేరని కలలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రియల్ స్టార్, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడుశ్రీహరి. మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు. పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచాడు. కరియర్ సాఫీగా పోతున్న తరుణంగా తీవ్ర అనారోగ్యంతో 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు శ్రీహరి. యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తినిపెంచుకున్న శ్రీహరి అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. ఈ క్రమంలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా నటనపై మక్కువ సినిమాలవైపు నడిపించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదట. అలాగే పాలిటిక్స్ అన్నా కూడా చాలా అసక్తి ఉండేది. కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని ఆయన అనుకునేవారట.(అప్పుడు ఎంత అంటే అంత!) 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి ఆ తరువాత నటుడుగా తన కరియర్‌కు బలమైన పునాదులు వేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో రాణించారు. వీటితోపాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ, తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశారు. రాంచరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ డూపర్ మగధీరలో షేర్ ఖాన్ పాత్ర, ఆయన కరియర్ గొప్ప మైలురాయి లాంటిది. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన నటన పెద్ద హైలెట్. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్, మేఘాంశ్ ఉన్నారు. హీరోగా రాణించానేది మేఘాంశ ఆకాంక్ష. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధికి కృషి చేయడం విశేషంగా నిలిచింది. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసారు. -
వెండితెర సంచలనం... నటి సిల్క్ స్మిత (ఫోటోలు)
-
హాస్యం ఒక ఇమ్యూనిటీ బూస్టర్
ఏ ప్రత్యేకతా లేకపోవడమే మధ్యతరగతి ప్రత్యేకత. ఏదైనా ప్రత్యేకత కోసం ప్రయత్నించడం కూడా మధ్యతరగతి ప్రత్యేకతే. కవిత్వం చదవడమో కొత్త వంట నేర్చుకోవడమో సంగీతం సాధన చేయడమో ‘క’ భాషో, కలం స్నేహమో ఏవైనా హాస్యాలు తెచ్చేవే. మందహాసాలు పూయించేవే. కోవిడ్ మన పెదాల మీద నవ్వులు దోచుకుపోయింది. నవ్వు చాలా పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్. జంధ్యాల వర్థంతి సందర్భంగా ఆయన నవ్వులు తలుచుకుని ఆ కామిక్ టానిక్ తాగుదామా? ఔత్సాహికులతో కొంచెం గడబిడే. వీళ్లు తమకు ఫలానాది వచ్చు అని గట్టిగా నమ్ముతారు. ఫలానాది నిజంగా తెలిసినవాళ్లు గతుక్కుమంటారు. ‘చారు ఎలా చేయాలో ఒక పాత్ర చేత చెప్పించి కథ అంటావా’ అంటాడు పొట్టి ప్రసాద్ ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మితో. ఏమో. అది కథెందుకు కాదు. ‘నెత్తికి రీటా కాలికి బాటా నాకిష్టం సపోటా’ ఇది కూడా కవిత్వమే అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. కాని పొట్టి ప్రసాద్ మాత్రం ‘నీకూ నాకూ టాటా... నన్నొదిలెయ్ ఈ పూట’ అని పారిపోవడానికి చూస్తాడు. ‘మనిషికి కాసింత కళాపోషణ ఉండాలి’ అని పూర్వం ముళ్లపూడి మునివర్యుడు అన్నాడు నిజమే. ఆ పోషణ ఎదుటివారి ప్రాణాలకై సాగే అన్వేషణ కారాదు కదా. పెళ్లిచూపులకు వచ్చిన సుత్తి వీరభద్రరావు నోరు మూసుకుని పిల్లను చూసి ఊరుకోకుండా ‘నాకు పాటలు పాడేవారం టే ఇష్టం’ అని అంటాడు పెళ్లికూతురైన శ్రీలక్ష్మి తో. అది శ్రీలక్ష్మి మనసులో పడిపోతుంది. నాకు పాట రాకపోయినా ఇతను పెళ్లి చేసుకున్నాడు.. ఇతన్ని ఏనాటికైనా నా పాటతో మెప్పిస్తాను అని హార్మోనియం పెట్టె ముందేస్కోని సా.. కీ.. కే...ఙ అనే రాగం తీస్తూ ఉంటుంది. భరించువాడు భర్తే అయితే సుత్తి వీరభద్రరావు నిజంగా భర్తే. అయితే ఈ కళలలో రాణించాలనే పిచ్చి స్త్రీలకే ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది. ‘నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం’ అని కవిత్వానికి తగులుకుంటాడు సుత్తి వీరభద్రరావు తాను కవి అని నమ్మి ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో. ఊళ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతడు పంచ రత్నాలు చదివిస్తాడు. ‘రంగ పెళ్లికొడుకు... గంగ పెళ్లికూతురు.. కిష్టిగాడు గంగ తండ్రి... వీరమ్మ రంగ తల్లి... ఇక మున్ముందు కిష్టిగాడు రంగమామ.. వీరమ్మ గంగ అత్త.. గంగను సింగారించి రంగకు జత కలిపారు... ’ ఇలా సాగుతుంది సుత్తి కవిత్వం. జనం ఇలా కాదని అతన్ని శిక్షించడానికి ఏకంగా ఏనుగునే బహూకరిస్తారు. ఏంటో.. బతుకులిలా ఏడుస్తున్నాయి అని అంటారుగాని అవి ఏడుస్తున్నాయా? వెతికితే ఎంత నవ్వు. ‘లేడీస్ స్పెషల్’లో శ్రీలక్ష్మి ఇంటికి ఎవరొచ్చినా తంటే. ఉదాహరణకు పోస్ట్‌మేన్ వచ్చి లెటర్ ఇస్తే అతణ్ణి పరీక్షగా చూసి ‘మీరు కనకమేడల సుందర్రావు కదూ’ అంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. ‘మీకెలా తెలుసు’ అంటాడు. ‘నేను కుక్కమూతుల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లిచూపులు చూసెళ్లిన పద్నాలుగో పెళ్లికొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడులడ్లు కారప్పూసా పెట్టారు. నేను సామజ వర గమనా పాడుతుంటే మీరు పారిపోయారు’ అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆమె పాటను గుర్తు చేసుకుని అతడు హడలిపోతూ ‘అది చెవిలో విషప్రయోగమండీ’ అంటాడు. సినిమా పిచ్చోళ్లు కూడా ఉంటారు ఇళ్లల్లో. భర్తకు సినిమా చూసే తీరిక ఉండదు. భార్యకు సినిమా కథ చెప్పక మనసు ఆగదు. ‘శ్రీవారి ప్రేమలేఖ’లో భర్త నూతన్ ప్రసాద్‌కు భార్య శ్రీలక్ష్మి తాను చూసొచ్చిన సినిమా కథలు చెబుతుంటుంది. కాని ఎలా? టైటిల్స్ నుంచి. ‘ఏబిసిడిఇఎఫ్ ప్రొడక్షన్స్ వారి ‘చిత్రవధ’.. కథానువాదం, దర్శకత్వం– శకుని, తారాగణం– జబ్బర్, ఉన్ని.. ’ ఆమె చెప్పే కథలకు సూపర్ ఫ్లాప్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ బాధ నూతన్ ప్రసాద్‌కు. సగటు జీవితాల్లో తిప్పలను చూసి ఏడ్వలేక నవ్వాడు దర్శకుడు జంధ్యాల. వాటిని చూపించి, ఎగ్జాగరేట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. చెప్పిందే చెప్పే పెద్దవాళ్లను ‘సుత్తి’ చేశాడు. ఆ దెబ్బలకు నలిగిపోయే వాళ్లకు కూడా ఒక చాన్స్ ఇచ్చి ‘రివర్స్ హామరింగ్’ వేసే చాన్స్ ఇచ్చాడు. కోడిని వేళ్లాడగట్టి అదే చికెన్ కర్రీ అని తినేసేవాళ్లను, మొగుని వొంటి మీద బట్టలు తప్ప తక్కినవన్నీ స్టీలు సామాన్ల వాడికేసి స్పూన్లు గరిటెలు తీసుకునే సాధ్వీమణులను, చనిపోయిన సంతానాన్ని తలుచుకుంటూ ప్రతివాడిని ‘బాబూ చిట్టీ’ అని కావలించుకునే వెర్రిబాగుల పాత్రలను చూపి కాసేపు హాయిగా నవ్వించాడు. నవ్వడం ఒక భోగం అన్నాడు జంధ్యాల. మార్కెట్లో ఇప్పుడు రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు అమ్ముతున్నారు. కాని హాస్యం అనే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్లను రెగ్యులర్‌గా ఇస్తూ తెలుగు వారి ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసిన వాడు జంధ్యాల. ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వడం మర్చిపోకూడదు. నవ్వే మనిషినే ఇష్టపడతాడు మనిషి. నవ్వే మనిషిని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. తోడు నవ్వుదామని చూస్తాడు. నవ్వుతూ ఉందాం. ఇటీవలి బాధల్ని వేదనల్ని భయాలను పూర్తిగా మర్చిపోయేంత వరకూ మంచి హాస్యాన్ని మూడు పూటలా తీసుకుంటూనే ఉందాం. – సాక్షి ఫ్యామిలీ -
Sushant Singh Rajput: ఏడాది పూర్తి.. ఏం తేల్చారు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెంది ఏడాది పూర్తయ్యింది. అతనిది ఆత్మహత్యా లేదంటే అభిమానులు ఆరోపిస్తున్నట్లు బాలీవుడ్ మాఫియా ప్రొద్భలం వల్ల జరిగిన హత్య అనే విషయంపై ఎటూ తేలకుండా పోయింది. సోషల్ మీడియాలో దాదాపు ఏడాదిగా సుశాంత్ మీదే చర్చ. ఒక టాలెంటెడ్ నటుడి మరణంతో సినీ వర్గాల్లో నెపొటిజం చర్చ మాత్రం విపరీతంగా కొనసాగింది. అనుమానాలు, ఆరోపణలు, విచారణ, వివాదాలు.. వీటి నడుమే సుశాంత్ మరణం కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. సాక్షి, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిష్క్రమణతో సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. హిందీ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ముఖంలో అమాయకత్వం.. అలరించిన అతని నటన్ని తల్చకుంటూ హఠాత్తుగా అతను లేడనే వార్తని అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే అతని మరణం పూర్తైన ఏడాది రోజున మళ్లీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ బాల్యం, అతని చదువు, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. పనిలో పనిగా సుశాంత్ కేసులో న్యాయం కావాలని కోరుకుంటూ.. ఇదొక ‘చీకటి రోజు’గా ప్రకటించారు. మరణం తర్వాత.. 34 ఏళ్ల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ముంబై పోలీసులు అది ఆత్మహత్య అని పేర్కొనడంతో మొదలైన చర్చ.. ఏడాది అయినా నడుస్తూనే ఉంది. డిప్రెషన్ సుశాంత్ ప్రధాన సమస్య అని మాజీ ప్రేయసి, సన్నిహితులు చెప్పగా, కాదు.. బాలీవుడ్లో కొందరు అతనికి అవకాశాల్లేకుండా చేసి అతన్ని మానసికంగా చంపేసి ఆపై ఆత్మహత్యకు ఉసిగొల్పారనేది ఫ్యాన్స్ వాదన. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా ఇదే వాదనతో ఏకీభవించడంతో ఈ చర్చ ప్రముఖంగా నడిచింది. ఇంకోపక్క ఈ కేసులో అనుమానాలున్నాయని సుశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. చదవండి: ఇంతకీ ఈ దిశ ఎవరు? చివరికి సీబీఐకి.. ఈ కేసులో సుశాంత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నటి రియా చక్రవర్తి మీదే అందరికీ అనుమానాలు రేకెత్తాయి. బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపి ఆమె సుశాంత్‌ను చంపేసిందని అభిమానులు ఆగ్రహం వెల్లకక్కారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ముంబై పోలీసుల దర్యాప్తు, అదే టైంలో అతని సొంతం రాష్ట్రం బిహార్ పోలీసుల దర్యాప్తు నడుమ కేసు గందరగోళంగా సాగింది. విచారణలో ముంబై పోలీసులు సహకరించడం లేదన్న బిహార్ ప్రభుత్వం ఆరోపణతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. దీన్నొక హై ప్రొఫైల్ కేసుగా అభివర్ణిస్తూ.. కేసును ఆగస్టు 19న సీబీఐకి అప్పజెప్పింది. మరోవైపు ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ, డ్రగ్స్ లింకుల నేపథ్యంలో ఎన్సీబీ.. సుశాంత్ కుటుంబ సభ్యుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల దాకా వీలైనంత ఎక్కువ మందిని ప్రశ్నించాయి.. అనుమానితుల్ని అరెస్ట్ చేశాయి. ఏదైతేనేం ఏడాది పూర్తయ్యింది. సీబీఐ నుంచి, ఇతర విభాగాల నుంచి సుశాంత్ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు. అందుకు సోషల్ మీడియా గట్టిగా #JusticeForSushantSinghRajput అని నినాదం చేస్తోంది. -
ట్రెండింగ్‌లో #JusticeForDisha
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పీఆర్ మేనేజర్‌గా వ్యవహరించింది దిశా సలియాన్. ఆమె మరణించి నేటికి(జూన్ 8) సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. దిశ చనిపోయిన ఆరు రోజులకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడు. దిశ మరణం ఈనాటికీ ఒక మిస్టరీనే. ఈ తరుణంలో దిశ చావుకి, సుశాంత్ చావుకి ఏదో లింక్ ఉందనేది సుశాంత్ ఫ్యాన్స్ అనుమానం. అందుకే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ట్విట్టర్లో జస్టిస్ ఫర్ దిశ హ్యాష్‌ట్యాగులతో క్యాంపెయిన్ నడిపించారు. ముంబై: దిశ సలియాన్ పోయినేడాది జూన్ 8న చనిపోయింది. ముంబైలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని జన్‌కళ్యాణ్ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చాలా కాలంగా డిప్రెషన్లో ఉందని, అందుకే సూసైడ్ చేసుకుందని దిశ కాబోయే భర్త రోహన్ రాయ్ మీడియాతో చెప్పాడు. అయితే ఆమె మృతిపై అందరికీ అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. శవంగా కింద ఉన్న టైంలో ఆమె ఒంటి మీద బట్టలు లేవని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని, ఆమె మరణానికి ముందు ఆమె అపార్ట్మెంట్కి కొందరు వచ్చారని, సామూహిక అత్యాచారం చేశారని, ఒకానొక దశలో నటుడు సూరజ్ పంచోలీ ఆమెను గర్భవతిని చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్న ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు దర్యాప్తును సీబీఐ తీసుకున్నాక.. దిశ కేసును కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక సెలబ్రిటీ ఫిగర్ విషయంలో ఇంతకాలమైనా ఎటు తేలకపోవడంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ కేసు చాలామందికి ముఖ్యంగా సుశాంత్ అభిమానులకు ఆమె పట్ల సానుభూతి క్రియేట్ అయ్యింది. మే 26.. దిశ డే దిశ సలియాన్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. ముంబైలో చదువుకున్న దిశ.. మాస్ మీడియా కోర్సులో డిగ్రీ చేసి పీఆర్ ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. టైమ్స్ గ్రూప్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. కొన్నాళ్లపాటు సుశాంత్ పీఆర్వోగా వ్యవహరించింది. ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త. టీవీ యాక్టర్ రోహన్ రాయ్‌తో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై వరల్డ్ రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో వారంలో కనీసం మూడు రోజులైనా ట్వీట్లతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో సింపథీతో దిశా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. మే 26న ఆమె పుట్టినరోజుకాగా.. ఆ రోజును ఏకంగా దిశ దినోత్సవంగా ట్విట్టర్లో జరిపారు కూడా. చదవండి: సుశాంత్‌కి పట్టిన గతే పడుతుంది -
తండ్రి వర్థంతి: హీరో వెంకటేష్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలన చిత్ర నిర్మాతగా వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నో బాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారు ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు. నేడు ఆయన 6వ వర్థంతి. 2015 ఫిబ్రవరి 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెండవ కుమారుడు, హీరో విక్టర్ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. తన ట్విటర్ ఖాతాలో తండ్రి చిత్ర పటాన్ని గురువారం షేర్ చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లు గడిచాయి. కానీ ఈ రోజు మిగిల్చిన చేదు అనుభవాన్ని మాత్రం అంత ఈజీగా మరవకలేకపోతున్నాం. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు నాన్న. లవ్ యూ. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే ఆయన పెద్ద కూమారుడు, నిర్మాత సురేష్ బాబు.. తండ్రికి ఘన నివాళులు అర్పించారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయడు విగ్రహానికి సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి పూల మాలలు వేసి నివాళులు ఘటించారు. Even after all these years, this day is never easy. Thank you for all the memories Nana. Love you and miss you 😞♥️ pic.twitter.com/lLPGe9nyMH — Venkatesh Daggubati (@VenkyMama) February 18, 2021 (చదవండి: ఆసక్తి రేపుతున్న నారప్ప టీజర్) (వెంకీ మామ ఇంటి పని అదిరింది) -
‘మాయ చేసి పోతివిరో నాగులూ’...
అసలు రమేశ్ నాయుడు ఏఆర్.డి. బర్మన్లానో ఏ మదన్మోహన్లానో దేశమంతా తెలిసిన సంగీత దర్శకుడు అయి ఉండాలి. అంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు తెలుగులో తక్కువ ఉన్నారు. ప్రతిభ ఉన్న తెలుగువాడు కదా ఉపయోగించుకుందాం అని గాడ్‌ఫాదర్‌లా నిలిచేవారు దేశంలో అంత కంటే తక్కువ ఉన్నారు. అయినప్పటికీ ఏమి. తెలుగువారికి ఆయన పాటలు వినే అదృష్టం దక్కింది. తెలుగువారి వాకిటలో ఆయన నాటిన పాటల నంది వర్థనాల కళ మిగిలింది. పి.సుశీల చేత, బాలూ చేత, జానకి చేత సున్నితంగా పాడించడం ఎవరైనా చేస్తారు. కాని ఎల్.ఆర్. ఈశ్వరి చేత కూడా ఆయన సున్నితంగా పాడించి శృంగారం అంటే అరుపులు, మూలుగులు కాదు గొంతులోని పిలుపులు అని నిరూపించారు. ‘జీవితం’ సినిమాలో ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన పాట ఎవరికి గుర్తు లేదు? ‘మాయ చేసిపోతివిరో నాగులూ... నా మాట మరిచిపోతివిరో నాగులూ’... రేడియోలో ఉదయమో మధ్యాహ్నమో నిద్రపోయే ముందు ఈ పాట తప్పక వినిపించేది. అంతేనా? ‘అమ్మ మాట’ కోసం ఒక పాట రికార్డు చేయాలి. సన్నివేశానికి తగినట్టు ఏదో రఫ్ నోట్స్ రాసుకుని భోజనానికి వెళ్లారు సి.నారాయణరెడ్డి. తొందరగా భోజనం ముగించుకు వచ్చిన రమేశ్ నాయుడు ఆ రఫ్ నోట్సే పల్లవి అనుకుని దానికి ట్యూన్ కట్టారు. అంటే అది న్యూస్పేపర్లోని వార్తకు ట్యూన్ కట్టడంతో సమానం. కాని రమేశ్‌నాయుడు కట్టారు. ఎల్.ఆర్. ఈశ్వరి చేత అంతే లలితంగా పాడించారు. ఆ పాట ఏదో తెలుసుగా? ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే’.... రమేశ్ నాయుడు ఎల్.ఆర్. ఈశ్వరితో పాడించిన ఈ రెండు పాటలు చెప్పాక ఇంకో పాట చెప్పకపోతే శిక్షార్హమైన నేరం అవుతుంది. లేదంటే ఓకే..యా అవుతుంది. ఎస్.. గుర్తుకొచ్చింది కదా. ‘దేవుడు చేసిన మనుషులు’ లో దేవకన్య కాంచన నైట్‌క్లబ్‌లో పాడే పాట. ఆ మసక మసక చీకటి. ఆ మల్లెతోట చాటు. ఆరుద్ర ఘాటు. ‘మసక మసక చీకటిలో.. మల్లెతోట ఎనకాల’... రమేశ్ నాయుడు దేశంలోని 12 భాషల్లో పాటలు చేశారు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి ఆయన ప్రయాణం 14 ఏళ్ల వయసులో మొదలయ్యి బొంబాయి, కలకత్తా, మద్రాసుల మీదుగా సాగింది. పావలా కాసు ప్రతిభ ఉంటే పది రూపాయల సౌండ్ చేసేవారు ఎక్కువ ఫీల్డ్‌లో. కాని వంద రూపాయల ప్రతిభ ఉంచుకుని కూడా రమేశ్ నాయుడు తనను తాను ముందు వరుసలో నిలబెట్టుకోవడానికి మొహమాటపడేవారు. సాహిత్యం వినిపించేలా చేయడం, గాయకుల ప్రతిభ కనిపించేలా చేయడం, వాద్య పరికరాలను వాటి హద్దుల్లో ఉంచడం ఇవి రమేశ్ నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ‘ఇక్కడే కలుసుకున్నాము... ఎప్పుడో కలుసుకున్నాము’ (జీవితం) పాట గుర్తుకు తెచ్చుకోండోసారి. రమేశ్ నాయుడికి వేణువంటే ఇష్టం. వేణుగానం ఉన్న పాటలు చాలా చేశారు. కాని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఘంటసాల పాడిన ఈ పాట అపురూపం. ఎన్నిసార్లు విన్నా ఆ వేణువులో ఆ గానంలో ఏదో వేదన ఉంటుంది. పాటలో వేదనను నింపడం అంత సులువు కాదు. ‘విన్నారా... అలనాటి వేణుగానం.. మోగింది మరలా’... కె.వి. మహదేవన్, సత్యం, చక్రవర్తి... ఈ ముగ్గురు కూడా (1975–85)ల మధ్య విపరీతమైన మార్కెట్లో ఉన్నారు. కమర్షియల్ సినిమాలంటే వీరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. కాని దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దాదాపుగా రమేశ్ నాయుడు చేత పాటలు చేయించుకోవడానికి ఇష్టపడేవారు. విజయ నిర్మల ‘మీనా’ సినిమాకు ఆయన చేసిన ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట ప్రతి శ్రీరామ నవమికి ప్లే అవుతూనే ఉంది. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాకు చేసిన పాటలు– ‘అలివేణి ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా కాలాలు మారేనా’ క్లాసిక్స్‌గా నిలువలేదూ! ఇక దాసరికి 20 సినిమాలు చేశారు. అన్ని సినిమాలు ఒకెత్తు... ‘మేఘసందేశం’ ఒకెత్తు. రమేశ్‌నాయుడు బాణీలు ఇవ్వడాన్ని ఇష్టపడేవారు కాదు. పాట రాస్తే సన్నివేశానికి తగినట్టుగా ట్యూన్ చేయాలనేది ఆయన ధోరణి. ‘మేఘసందేశం’కు మహాకవులు పాటలు రాశారు. వేటూరి ‘ఆకాశదేశాన.. ఆషాఢ మాసాన’ అన్నారు. కృష్ణశాస్త్రి ‘సిగలో అవి విరులో’ అన్నారు. ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని కూడా అన్నారు. వీటికి తోడు జయదేవుని అష్టపది ‘ప్రియే చారుశీలే’. వీటన్నింటిని సుశీల, ఏసుదాసుల గొంతులో మరికొన్ని మల్లెలు నింపి శ్రోతలకు పరిమళాలు వొంపారు. ఇదే సినిమాలో మంగళంపల్లి చేత ‘పాడనా వాణి కల్యాణిగా’ పాడించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు. ఇవన్నీ చేసింది హైస్కూలు చదువు కూడా సరిగా లేని రమేశ్ నాయుడు... ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోని రమేశ్ నాయుడు. ఒకనాటి ‘దేవదాసు’ స్ఫూర్తితో కృష్ణ ‘దేవదాసు’ తీస్తే ఆనాటి పాటలకు దీటుగా రమేశ్ నాయుడు పాటలు ఇచ్చారు. ‘మేఘాల మీద సాగాలి’. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’, ‘కల చెదిరింది.. కథ మారింది’ ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. కాని అక్కినేని దేవదాసు ప్రభావం ఈ దేవదాసు మీద పడింది. కృష్ణ నటించిన ‘అంతం కాదిది ఆరంభం’, ‘భోగిమంటలు’, ‘సూర్యచంద్ర’ సినిమాలకు రమేశ్ నాయడు సంగీతం అందించారు. బాలూతో రమేశ్ నాయుడు పాడించిన సోలో గీతాలు సంగీత సాహిత్యాల మేలుకలయికతో నిలిచి ఉన్నాయి. ‘దోర వయసు చిన్నది’ (దేవుడు చేసిన మనుషులు), ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), ‘లలిత కళారాధనలో’ (కల్యాణి), ‘పారాహుషార్ పారాహుషార్’ (స్వయంకృషి) ఇవన్నీ రమేశ్ నాయుడిని తెలుగు శ్రోతల నుంచి దూరం చేయకుండా పట్టి ఉంచాయి. రమేశ్ నాయుడు 54 ఏళ్ల వయసులో 1987లో మరణించారు. ఆయన పాట అపూర్వం. అపురూపం. ఆగక వినిపించే తుమ్మెద సంగీతం. జోరు మీదున్నావు తుమ్మెదా... ఈ జోరెవరి కోసమే తుమ్మెదా.. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రత్యక్ష పోరాటాలే ఆయనకు నిజమైన నివాళి
సాక్షి,హైదరాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష ఆందోళనలకు దిగడమే అమరుడు దొడ్డి కొమరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గతంలో వెట్టిచాకిరీ రూపంలో అణచివేత ఉంటే, ఇప్పుడు ప్రజాస్వామ్య ముసుగులో పరోక్షంగా అది కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్థంతి సందర్భంగా శనివారం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమరయ్య చిత్రపటానికి పార్టీనాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, వీఎస్ బోస్, డా. సుధాకర్, ఈటీ నర్సింహ పూలమాలలేసి నివాళులర్పించారు. అణచివేత సాధ్యం కాదు భూస్వాములు, పెట్టుబడిదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో తిరుగుబాటుతత్వాన్ని అణచివేయడం సాధ్యం కాదని తెలంగాణ సాయుధపోరాటం గుర్తుచేస్తోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతుసంఘం కార్యాలయంలో కొమరయ్య చిత్రపటానికి మల్లారెడ్డి, టి.సాగర్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. టీఎన్జీవోల నివాళి దొడ్డి కొమరయ్యకు టీఎన్జీవో నేతలు నివాళులు అర్పించారు. టీఎన్జీవోల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కొమరయ్య అమరత్వం రాష్ట్ర ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైందన్నారు. -
సొమ్మసిల్లి పడిపోయిన ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్
భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దివంగత రాజకీయ వేత్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రఙ్ఞా సింగ్ పాల్గొన్నారు. కొంతసేపటికే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా కంటి సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో తన కంటిచూపు పోయిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. (సఫూరాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ) ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సహా పలువురు బీజేపీ నేతలు శ్యామా ప్రసాద్‌కు నివాళులు అర్పించారు. భారతదేశపు ముద్దుబిడ్డ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ముఖర్జీ రచనలను ప్రస్తావిస్తూ అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, దేశ సమగ్రత కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించుకున్న గొప్ప వ్యక్తి అంటూ అమిత్‌షా ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి ) -
దాసరి లేని లోటు తెలుస్తోంది
‘‘కరోనా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని దాసరిగారైతే మరోలా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు లేదు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. శనివారం దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్థంతి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ ప్రముఖులు దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు లేని లోటు కనిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘మేం దాసరిగారి దగ్గర పని చేయలేదు. అయినా ఆయన మనుషులం అని గర్వంగా చెప్పుకుంటాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘ప్రతి ఒక్కరికీ విలువ ఇచ్చి మాట్లాడేవారు దాసరిగారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చేయలేరు’’ అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్. ‘‘నేను బతికి ఉన్నంత కాలం దాసరిగారి జయంతి, వర్థంతి జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాదీ దాసరి అవార్డ్స్ కొనసాగిస్తాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శ్రీకాంత్, రేలంగి నరసింహా రావు, రాజా వన్నెం రెడ్డి, తాండవ, పీడీవీ ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి ఫుడ్ ప్యాకెట్లు, స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు రామసత్యనారాయణ. -
నాన్న పేరు గుర్తుండిపోయేలా....
సినిమాని కాచి వడపోసిన వారు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలు తీసి గురువును(దాసరి నారాయణరావు) మించిన శిష్యుడు అనిపించుకున్నారు. కోడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి శనివారం (22న). ఈ సందర్భంగా ఆయన కుమార్తెలు దీప్తి, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది మా కోరిక. అందుకే ఆయన పేరుతో సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు తీస్తాం.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా పాలకొల్లులో పుట్టి పెరిగిన కోడి రామకృష్ణ పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తయ్యాక చెన్నై వెళ్లి దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలందరితో పని చేశారు. తమిళ, హిందీ, కన్నడ, మల యాళ చిత్రాలకూ దర్శకత్వం వహించా రాయన. ఆయన దర్శకత్వంలో చివ రిగా వచ్చిన చిత్రం ‘అరుంధతి’. -
మన అణ్వస్త్ర విధానం మారొచ్చు
జైపూర్/న్యూఢిల్లీ: సరిహద్దులో పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదు’అన్న విధానానికే భారత్ కట్టుబడి ఉందనీ, అయితే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్(1974, 1998 అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతం)ను రాజ్‌నాథ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌బిహారీ వాజ్‌పేయి దృఢసంకల్పానికి ఈ ప్రాంతం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అణ్వస్త్రాలను ఇతరులపై మొదటగా ప్రయోగించరాదన్న సిద్ధాంతానికి భారత్ ఇప్పటికీ గట్టిగా కట్టుబడింది. కానీ భవిష్యత్‌లో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఇది మారొచ్చు’అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్రశక్తిగా మారడం ప్రజలందరికీ గర్వకారణమే. ఇందుకు భారత్ అటల్జీకి రుణపడి ఉంటుంది’అని ట్వీట్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అణ్వాయుధాల ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను బయటపెట్టాలనీ, ఈ అస్పష్టతకు తెరదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వెనుక దేశమంతా నిలబడుతుందనీ, అయితే ముందుగా మన అణు విధానంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరింది. -
అటల్జీ తొలి వర్ధంతి : అగ్ర నేతల నివాళి
సాక్షి,,న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు శుక్రవారం .దేశ రాజధానిలోని వాజ్‌పేయి స్మృతి కేంద్రం సదవ్ అటల్‌ను సందర్శించిన నేతలు వాజ్‌పేయి జాతికి అందించిన సేవలను ప్రస్తుతించారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారిక పలువురు బీజేపీ నేతలు, పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వాజ్‌పేయి తొలి వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. -
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అనంతపురం: కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం అనంతపురంలో జరిగింది. జిల్లాలో 44వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. మా స్ఫూర్తి, ఆదర్శం రంగా: రాధా విజయవాడ నగరంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్కులోని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి వంగవీటి రాధాకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్లు అయినా వాడవాడలా అభిమానులు ఆయన వర్థంతిని జరుపుతున్నారని అన్నారు. రంగా ఒక కులం.. ఒక మతం.. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. దేశవిధేశాలలో ఆయనకు అభిమానులున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉండాలలని ఉద్బోధించారు. కాగా, నగరంలోని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో వంగవీటి వర్ధంతి జరిగింది. పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆసిఫ్, సోమినాయుడు, తోట శ్రీనివాస్, అడపా శేషు, పలువురు కార్పొరేటర్లు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా ఆశయాలను ఆయన అభిమానులు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. అలాగే స్థానిక రాఘవయ్య పార్కు వద్ద రంగా విగ్రహానికి ఆయన కుమారుడు రాధా నివాళులు అర్పించారు. ఆయనతోపాటు సినీ నటుడు జివి నాయుడు కూడా ఉన్నారు. అనంతరం రంగాపై మెగా సీరియల్ తీస్తున్నట్టు జీవీ ప్రకటించి పోస్టర్ ఆవిష్కరించారు. చిలకలూరిపేటలో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రంగా వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ ధియేటర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. -
ఎద ఎదలో ఉప్పొంగిన అభిమానఝురి
ఆ చిరునవ్వు దూరమై అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి. గుండె లోతుల్లో కొలువైన మహనీయుడ్ని తలుచుకోని వారు లేరు.. చమర్చిన కళ్లతో ప్రతి హృదయం పేదల దైవం కోసం పరితరించింది. సృష్టి ఉన్నంత కాలం ఆయన సేవలు అజరామంఅంటూ వేనోళ్ల కీర్తించింది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలే కాదు.. పార్టీలకతీతంగా కూడా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సైతం మహానేతను స్మరించుకుని నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, సామాజిక పింఛన్లు ఇలా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ మహానేతను స్మరించుకున్నారు. మహానేత విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులైతే ఊరూ వాడా సేవా కార్యక్రమాలతో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆస్పత్రులు, విద్యాలయాలు, అనాథాశ్రమాల్లో అన్నదానాలు, నిరుపేదలకు వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, ఆర్థిక సహాయం చేయగా, ఆస్పత్రుల్లో రోగులకు పాలు,పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. –సాక్షి, విశాఖపట్నం