
సాక్షి,,న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు శుక్రవారం .దేశ రాజధానిలోని వాజ్‌పేయి స్మృతి కేంద్రం సదవ్ అటల్‌ను సందర్శించిన నేతలు వాజ్‌పేయి జాతికి అందించిన సేవలను ప్రస్తుతించారు.
వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె నమితా కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారిక పలువురు బీజేపీ నేతలు, పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి దివంగత నేతకు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వాజ్‌పేయి తొలి వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment