సాక్షి, విజయవాడ : మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్న నిందితురాలిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరు డీసీపీ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బ్రాడిపేటలో నివసిస్తున్న దీప్తి విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడింది.
తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మ్యాట్రీమోనిలో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వివరాలను పొందుపర్చింది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణి కుమార్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. లక్షా 86 వేల తీసుకుంది. తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగింది.
దాంతో మోసపోయానని గ్రహించిన సాప్ట్ వేర్ ఉద్యోగి ధరణి కుమార్ పోలీసులను ఆశ్రయించినట్లు డీసీపీ వెల్లడించారు. గతంలో దీప్తిపై ఇలాంటి కేసులే ఉన్నట్లు తెలిపారు. కొంతమంది అమ్మాయిలు దుర్బుద్ధితో వేరొకరి ఫొటోలతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ అకౌంట్లు తయారే చేసుకుంటున్నారని చెప్పారు. వివాహ సంబంధాల కోసం వెబ్‌సైట్లలో వెదికే వారు తెలియని వాళ్లకు నగదు పంపడం కరెక్టు కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment