అంత్యక్రియలను ఆపి...పోస్ట్‌మార్టానికి మృతదేహం | Dead body stops and post-funeral | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలను ఆపి...పోస్ట్‌మార్టానికి మృతదేహం

Published Sat, Apr 2 2016 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Dead body stops and post-funeral

మెట్‌పల్లి : ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి శ్మశానానికి తరలిస్తుండగా పోలీసులు ఆపి ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, స్థానిక శివాజీనగర్‌కు చెందిన గోల్కొండ శంకర్(40) ఓ మేస్త్రీ కింద కూలీ పని చేస్తున్నాడు. అతనికి భార్య వనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా అర్థిక ఇబ్బందులతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు.

ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురైన శంకర్ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఈ విషయం పోలీసులకు తెలుపకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి శ్మశానానికి తరలిస్తుండగా సమాచారమందుకున్న పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఆ తర్వాత శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించి తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement