- రెండు కుటుంబాల్లో విషాదం
పెనుగంచిప్రోలు/మక్కపేట : స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకుని రెండు రోజులు గడుస్తున్నా ఈఘటన వెనుక ఉన్న మిస్టరీ వీడలేదు. వత్సవాయి మం డలం మక్కపేట గ్రామంలో ఆదివారం పురుగు మం దు తాగి ఆత్మహత్య చేసుకున్న పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామంలోని తుఫాన్ కాలనీలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఆమెను చూ సేందుకు బంధువులు, గ్రామస్తులే కాక, స్నేహితులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
సునీత సోదరుడు గోపి పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోదరి మరణించి న విషయం తెలుసుకుని హుటాహుటిన ఇక్కడకు వ చ్చాడు. ఆమె మృ తదేహం చూసి గుండెలవిసేలా రోదించాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సునీతకు రెండు నెలల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లో ఉంటున్న భర్త, అత్తింటివారు ఇక్కడకు వచ్చారు. సునీత మృతదేహాన్ని చూ సి భోరున విలపించారు. మక్కపేట గ్రామానికి చెం దిన ధారావతు అరుణ మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. కుమార్తె మరణాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. అరుణ సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సోదరి మరణవార్త విని వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. అరుణ మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు. వీరిద్దరి ఆత్మహత్యలపై కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ, స్నేహితు లు గానీ ఏ విషయం చెప్పలేక పోతున్నారు. పోలీ సులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.