పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ? | Special team to solve tribal girls death mystery! | Sakshi
Sakshi News home page

పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ?

Published Sun, Jan 3 2016 4:28 AM | Last Updated on Thu, Jun 14 2018 4:21 PM

పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ? - Sakshi

పోస్టుమార్టంలోనూ నిర్లక్ష్యం జరిగిందా ?

నర్సంపేట : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రవు పాఠశాలకు చెందిన విద్యార్థుల అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యో.. ఆత్మహత్యో తేల్చేందుకు కీలకమైన పోస్టుమార్టంను హడావుడిగా నిర్వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారులోని గుట్టల్లో డిసెంబర్ 27న లభ్యమైన భూమిక, ప్రియాంక మృతదేహాలకు నర్సంపేటకు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే.

బాలికల మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉండగా అనుభవజ్ఞులైన వైద్యులతోగాని, ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోగానీ పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా స్థానిక వైద్యులతో మమ అనిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి హడావుడిగా బంధువులకు మృతదేహాలను అప్పగించారు.

దీంతో వారం రోజులు కావొస్తున్నా వాస్తవ విషయాలు పోలీసులకు లభించకపోవడంతో శనివారం కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్‌రావుకు సంఘటన స్థలాన్ని చూపించి, నర్సంపేటకు పిలిపించి పోస్టుమార్టం రిపోర్ట్‌ను పోలీసులు చూపించినట్లు తెలిసింది. సంఘటన వెలుగులోకి వచ్చిన రోజే ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి పోస్టువూర్టం నిర్వహిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉండేది. అలా చేయుకపోవడంతో ప్రస్తుతం బాలికల అనుమానాస్పద మృతి పోలీసులకు తలనొప్పిగా మారింది.
 
ఆ నలుగురిపై ఆరోపణలు
పర్వతగిరి : పోలీసులకు అంతుచిక్కని భూమిక, ప్రియూంక అనుమానాస్పద మృతి కేసులో ప్రధానంగా నలుగురిపైనే ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నుంచి ఆటోడ్రైవర్ జేరిపోతుల రాముపై అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. మూడుచెక్కలపల్లి ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో వంట మనిషి రాజమ్మ కుమారుడు వినోద్‌పై కూడా బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ప్రియాంక ఇంటికి వచ్చిన సమయంలో ప్రియాంక నాన్న కిషన్ సెల్‌కు ఫోన్ చేసి మీ గోత్రం ఏమిటని అడిగినట్లు తెలిపారు. గోత్రంతో నీకేం పని అంటూ ప్రశ్నించి ఫోన్ కట్ చేసినట్లు చెబుతున్నారు.

కాల్ లిస్ట్‌లో అతడు ఫోన్ చేసినట్లు తేలింది. కాగా చివరి ఫోన్ రాజమ్మ సెల్ నుంచి రాగా ఆమె కొడుకు వినోద్ మాట్లాడి ఉండవచ్చనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో చెడు ప్రవర్తన వల్ల అనిల్ అనే టీచర్‌ను తొలగించారని, అతడికి రాజమ్మ దగ్గరి మనిషి కావడం వల్లే అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. జేరిపోతుల రాము, రాజమ్మ, ఆమె కుమారుడు వినోద్, అనిల్‌పై బాలికల కుటుంబసభ్యులు ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం
భూమిక, ప్రియాంక అనుమానాస్పద మృతిపై నర్సంపేట సీఐ బోనాల కిషన్ వారి కుటుంబసభ్యులను శనివారం కలిశారు. కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానాలు ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

బాలికల మృతిపై ఐటీడీఏ పీఓ విచారణ
నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు బానోత్ ప్రియూంక, భూమిక అనుమానాస్పద మృతిపై ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ పాఠశాలను శనివారం సందర్శించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులతో సమావేశమయ్యూరు. వర్కర్ రాజమ్మ, గతంలో పనిచేసిన సీఆర్టీల వ్యక్తిత్వం, వ్యవహార శైలి, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ విలేకరులతో మాట్లాడుతూ బాలికల భద్రత కోసం పాఠశాల ప్రహరీ రెండు ఫీట్లు పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

కాగా బాలికల మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు పీఓ కు వినతిపత్రం అందజేశారు. అణగారిన వర్గాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పరికి కొర్నేల్, తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక డివిజన్ అధ్యక్షుడు బట్టు సాంబయ్య, జేఏసీ డివిజన్ అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు, బహుజన ఐక్య వేదిక మండల అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య పాల్గొన్నారు.  కేఎంసీ ప్రొఫెసర్ విచారణ
 
చెన్నారావుపేట : మండలంలోని ఖాదర్‌పేట శివారు నల్లగుట్టపై విద్యార్థినుల మృతి విషయమై కాకతీయ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ నాగమోహన్‌రావు శనివారం విచారణ జరిపారు. ముందు మృతదేహాలు ఉన్న స్థలాన్ని సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో మృతి ఫొటోలు, రికార్డులను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫోరెన్సిక్ నివేదికతో విచారణ ముమ్మరం చేస్తామని చెప్పారు. సీఐ బోనాల కిషన్, ఎస్సై పులి వెంకట్‌గౌడ్, హెచ్‌సీలు కనకచంద్రం, ప్రభాకర్, నరేష్, వుస్తాన్, దామోదర్, శివ పాల్గొన్నారు.
 
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

* టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి డిమాండ్
 పర్వతగిరి : బాలికలు భూమిక, ప్రియూంక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తమ పిల్లలు తప్పిపోయూరని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. పైగా వారిపైనే అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఎర్రబెల్లితో టీడీపీ నాయకులు మాడ్గుల రాజు, జాటోత్ శ్రీనివాస్ ఉన్నా రు. కాగా మృతుల కుటుంబసభ్యులు తమ పిల్లల మృతదేహాలను కుక్క లు పీక్కు తిన్నాయని రోదిస్తూ చెబుతుండగా ఎర్రబెల్లి కన్నీరు పెట్టారు.
 బాలికల మృతిపై స్పష్టత ఇవ్వాలి
     
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య
పర్వతగిరి : గిరిజన బాలికల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇ వ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అ న్నారు. మండలంలోని నారా యణపురం శివారు కంబాలకుంట తండాకు చెందిన బాలి కలు భూమిక, ప్రియాంక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల మృతిపై హాస్టల్ సిబ్బంది, జిల్లా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.

15రోజులు ఇంట్లో జ్వరంతో ఉన్న విద్యార్థులను హాస్టల్‌లో ఉన్నట్లు హాజరు వేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. కేసు విచారణలో సమగ్ర దర్యాప్తు చేయూలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనతో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు రాజ్‌కుమార్‌గౌడ్, అప్పం కిషన్, కుమార్‌గౌడ్, కేదారి గౌడ్, కోల రమేష్, కేదారి యాదవ్, దొంతి కమలాకర్‌రెడ్డి, అక్కల అనిల్, మదాసి సుధాకర్,  మండల నాయకులు సైదులు, వడ్లకొండ వీరభద్రయ్య, జంగ మురళి, వీరమల్లు ఉన్నారు.
 
కలెక్టర్‌గారూ... కరుణించరూ..
పర్వతగిరి : కూతుళ్లను పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక తల్లిదండ్రులపై ఎవ్వరూ కనికరం చూపించటం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని ఈ కుటుంబంలో పిల్లల మృతి విషాదాన్ని నింపింది. 40 రోజులుగా జీవచ్ఛవాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ కేసును సుమోటోగా స్వీకరించిన రాష్ర్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అచ్యుతరావు బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున తక్షణ సాయం కింద అందజేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. బాధిత కుటుంబాలను జిల్లా యంత్రాంగం సంగతి అటుంచితే కనీసం మండల స్థాయి అధికారులు పలకరించిన పాపానపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనులని ప్రభుత్వం, అధికారులు, జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement