గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బరాక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.
విశాఖపట్నం: గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూ బరాక్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆర్డీవో వెంకటేశ్వర్లు సమక్షంలో అధికారులు శవపంచనామా నిర్వహించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోల ఎదురుదాడిలో గాయపడ్డ మరో కానిస్టేబుల్ డి.సతీష్‌కు విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తి అయింది. కాలులో ఉన్న బుట్టెట్ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సతీష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.