ప్రేమజంట ఆత్మహత్య
► పెళ్లికి అడ్డుపడిన పెద్దలు
► మనస్తాపంతో అఘాయిత్యం
పెద్దపల్లి/ఓదెల : వారిద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. మూడుముళ్లు ఏడడుగుల బంధంతో ఏకమవ్వాలని ఆశపడ్డారు. కానీ వారి ప్రేమ.. పెళ్లికి కులం అడ్డొచ్చింది. అబ్బారుు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు కలిసి బతకలేకపోరుునా.. కలిసే చనిపోదామని నిర్ణరుుంచుకున్నారు. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి మరణంలోనూ ఏకమయ్యూరు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన కేశెట్టి కృష్ణమూర్తి అలియూస్ కిట్టు(28), మద్దెల మౌనిక(23) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఈ జంట కొలనూర్ నుంచి వెళ్లి వేములవాడ మండలం అగ్రహారంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా కిట్టు బంధువులు అడ్డుకున్నారు.
దీంతో పెళ్లి అక్కడే ఆగింది. తనకు న్యాయం చేయాల్సిందిగా మౌనిక గురువారం కొలనూర్‌లోని కిట్టు ఇంటి ముందు దీక్షకు దిగింది. పొత్కపల్లి ఎస్సై శంకరయ్య జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లి జరిపేందుకు హామీ ఇచ్చారు. మళ్లీ కిట్టు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇక తాము కలిసి జీవించలేమని మనస్తాపం చెందారు. శనివారం గ్రామం నుంచి బైక్‌పై బయల్దేరి పెద్దపల్లికి చేరుకున్నారు. పట్టణంలో కూల్‌డ్రింక్‌తోపాటు క్రిమిసంహారక మందు కొనుగోలు చేశారు. అనంతరం స్థానిక రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ రియల్ వెంచర్‌లో గల షెడ్ ఆవరణలో కూల్‌డ్రింగ్‌లో విషయం కలుపుకొని తాగి మృతి చెందారు. రాఘవాపూర్ గ్రామస్తులు మృతహదేహాలను చూసి పెద్దపల్లి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వద్ద లభించిన ఆధారాలతో కొలనూర్‌కు చెందిన కిట్టు, మౌనికగా గుర్తించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
స్థానిక సివిల్ అసుపత్రికి పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించారు. కొలనూర్‌లో కిట్టు, మౌనికలకు బంధువులు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. కిట్టు తండ్రి కేశెట్టి రాజయ్య, మౌనిక తండ్రి మద్దెల వెంకటయ్య నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అందరితో కలివిడిగా స్నేహంగా ఉండే కిట్టు, మౌనిక ఆత్మహత్యతో వారి బంధుమిత్రులు, స్నేహితులు విషాదంలో మునిగారు. డిగ్రీ పూర్తి చదివిన ఒక్కగానొక్క కూతురు మద్దెల మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లితండ్రులు మద్దెల వెంకటయ్య, లక్ష్మి తల్లిడిల్లుతున్నారు. కేశెట్టి రాజయ్య దంపతుల చిన్నకుమారుడు కిట్టు. చిన్పప్పటినుంచి కష్టపడి కుటుంబానికి అండగా ఉండే కిట్టు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.